YS Sharmila: విశాఖపట్నంలో ఓట్ చోర్ - గద్దీ చోడ్ కార్యక్రమం.. పాల్గొన్న షర్మిల
ABN, Publish Date - Oct 08 , 2025 | 08:21 AM
విశాఖపట్నం కంచరపాలెం కప్పరాడ 47వ వార్డులో ఓట్ చోర్ - గద్దీ చోడ్ కార్యక్రమంలో భాగంగా భారీ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు.
ఓట్ చోర్ - గద్దీ చోడ్ (ఓట్ల దొంగ-గద్దె దిగండి) నినాదంతో ఏపీ కాంగ్రెస్ మంగళవారం సాయంత్రం విశాఖపట్నం నగరంలో కార్యక్రమం నిర్వహించింది.
ఉత్తర నియోజకవర్గ పరిధిలో జరిగిన ఈ క్యాంపెయిన్‌లో పీసీసీ అధ్యక్షురాలు వై ఎస్. షర్మిల పాల్గొన్నారు.
స్థానిక ప్రజలతో ఆమె మమేకమై సంతకాలు సేకరించారు. ఓట్ల చోరీ వ్యవహారంపై రాహుల్‌గాంధీ చేస్తున్న పోరాటాన్ని ప్రజలకు వివరించారు షర్మిల.
కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలవాలని కోరారు షర్మిల.
దేశంలో ఓట్ల చోరీ జరిగిందని విమర్శించారు షర్మిల.
దొంగ ఓట్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గెలిచారని ఆరోపించారు షర్మిల.
కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకువచ్చి సంతకాలు చేస్తున్నారనిపేర్కొన్నారు షర్మిల.
ఓట్ చోర్ - గద్దీ చోడ్ కార్యక్రమంలో సంతకాలు చేస్తున్న ప్రజలు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు అడ్డాల వర్మరాజు, ఉత్తరాంద్ర ఇన్‌చార్జి లక్కరాజు రామారావు, నాయకులు ప్రియాంక దండి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 08 , 2025 | 08:23 AM