ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vallabhaneni Vamsi Remand : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులోవల్లభనేని వంశీకి రిమాండ్

ABN, Publish Date - Feb 14 , 2025 | 07:32 AM

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు గురువారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా మొత్తం 88 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

1/5

టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీపై కేసు నమోదైంది.

2/5

అయితే రెండ్రోజుల క్రితం హఠాత్తుగా సత్యవర్ధన్ కేసును వెనక్కి తీసుకున్నారు. అయితే వంశీ, అతని అనుచరులు సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి బెదిరింపులకు దిగారని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి.

3/5

అందుకే అతను కేసు వెనక్కి తీసుకున్నారని టీడీపీ నేతలు పోలీసులకు చెప్పారు. ఈ మేరకు సత్యవర్ధన్‌ను పోలీసులు విచారించగా నిజమేనని తేలింది. దీంతో హైదరాబాద్‌లో ఉన్న వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేసి విజయవాడకు తరలించారు.

4/5

వల్లభనేని వంశీకి విజయవాడ జిల్లా కోర్టు రిమాండ్ విధించింది.

5/5

టీడీపీకి చెందిన బీసీ, మైనార్టీ, దళిత నాయకులు రమాదేవి, సురేశ్‌ బాబు, ఫణికుమార్‌, షేక్‌ జానీ ఇదే అంశంపై చేసిన ఫిర్యాదుపై ఇంకో కేసు పెట్టారు. ఈ రెండు కేసుల్లో పోలీసులు వల్లభనేని వంశీని ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఆయన ప్రధాన అనుచరులు కొమ్మా కోట్లు, రామకృష్ణ, నీరజ్‌ తదితరులను నిందితులుగా చేర్చారు.

Updated Date - Feb 14 , 2025 | 08:10 AM