ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Thalassemia Run: ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో తలసేమియా రన్‌

ABN, Publish Date - Jul 20 , 2025 | 10:20 AM

విశాఖపట్నంలోని రామకృష్ణా బీచ్‌రోడ్డులో శనివారం సాయంత్రం ఆరు గంటలకు తలసేమియా రన్‌ నిర్వహించారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో తలసేమియాపై అవగాహన కోసం ఈ రన్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె జెండా ఊపి 10కే, 5కే, 3కే రన్‌ను ప్రారంభించారు. అనంతరం విజేతలకు భువనేశ్వరి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సీఈవో రాజేంద్రకుమార్‌, మాజీ వెయిట్‌ లిఫ్టర్‌ కరణం మల్లీశ్వరి, ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌, తదితరులు పాల్గొన్నారు. అనంతరం భువనేశ్వరి ప్రసంగించారు.

1/14

విశాఖపట్నంలోని రామకృష్ణా బీచ్‌రోడ్డులో శనివారం సాయంత్రం ఆరు గంటలకు తలసేమియా రన్‌ నిర్వహించారు.

2/14

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో తలసేమియాపై అవగాహన కోసం ఈ రన్‌ ఏర్పాటు చేశారు.

3/14

ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

4/14

భువనేశ్వరి జెండా ఊపి 10కే, 5కే, 3కే రన్‌ను ప్రారంభించారు.

5/14

అనంతరం విజేతలకు భువనేశ్వరి బహుమతులు అందజేశారు.

6/14

ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సీఈవో రాజేంద్రకుమార్‌, మాజీ వెయిట్‌ లిఫ్టర్‌ కరణం మల్లీశ్వరి, ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్ ఎస్ తమన్‌, తదితరులు పాల్గొన్నారు. అనంతరం నారా భువనేశ్వరి ప్రసంగించారు.

7/14

తలసేమియా పుట్టుకతో వచ్చే జన్యుపరమైన వ్యాధి అని నారా భువనేశ్వరి తెలిపారు.

8/14

ఈ వ్యాధితో బాధపడే పిల్లలకు ప్రతి 21 రోజులకు రక్తం ఎక్కించాల్సి ఉంటుందని నారా భువనేశ్వరి చెప్పుకొచ్చారు.

9/14

ఎక్కువ మంది రక్తదానం చేస్తే ఆయా పిల్లలకు సాంత్వన లభిస్తుందని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.

10/14

ఈ వ్యాధిపై అందరిలో అవగాహన కల్పించేందుకు ఈ రన్‌ నిర్వహిస్తున్నామని నారా భువనేశ్వరి తెలిపారు.

11/14

ఈ రన్‌లో పలువురు ప్రముఖులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

12/14

ఈ రన్‌ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు, పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు.

13/14

ఎన్టీఆర్‌ బ్లడ్‌ బ్యాంకుకు చిన్నారులతో వచ్చిన కొందరు తల్లులు.. బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ చేయించగలరా? అని తనను అడగడంతో.. వారి కోసం ఏదైనా చేయాలనే నిర్ణయంతో తలసేమియా రన్‌ నిర్వహిస్తున్నట్లు నారా భువనేశ్వరి పేర్కొన్నారు.

14/14

తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ చేయించడంతోపాటు ఫిల్టర్స్‌, రూ. 6 వేల విలువజేసే మందులు అందిస్తున్నామని నారా భువనేశ్వరి వెల్లడించారు.

Updated Date - Jul 20 , 2025 | 10:27 AM