షైనింగ్ స్టార్స్ అవార్డ్స్-2025.. విద్యార్థులకు అవార్డులే అవార్డులు..
ABN, Publish Date - Jun 09 , 2025 | 08:19 PM
పదోతరగతి, ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన షైనింగ్ స్టార్స్ అవార్ట్స్-2025లో భాగంగా పార్వతీపురంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో పదో తరగతిలో ప్రతిభ కనబర్చిన 95మంది, ఇంటర్మీడియట్‌లో ప్రతిభ కనబర్చిన 26మంది విద్యార్థులకి మంత్రి నారా లోకేష్ అవార్డులు అందజేశారు. ప్రభుత్వ విద్యావ్యవస్థను ప్రైవేటు రంగానికి మించి అద్భుతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో విద్యారంగంలో అనేక సంస్కరణలు తెస్తున్నామని లోకేష్ చెప్పారు. అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నాం.. సంస్కరణల ద్వారా రాబోయే నాలుగేళ్లలో ఏపీ విద్యారంగంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
Updated Date - Jun 09 , 2025 | 08:19 PM