అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థలకు శంకుస్థాపన
ABN, Publish Date - Nov 28 , 2025 | 02:14 PM
అమరావతిలో 15 జాతీయ బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తోపాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
అమరావతిలో 15 జాతీయ బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తోపాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. గత పాలకుల విధ్వంసంతో ఆగిపోయిన అమరావతి రాజధాని పనుల్ని ప్రధాని మోదీ పునఃప్రారంభించారన్నారు.
ప్రపంచంలో స్ఫూర్తిదాయకమైన ల్యాండ్ పూలింగ్ విధానంలో భూముల పొందిన ప్రాంతం అమరావతి అని, రూ.1,334 కోట్లతో బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేయడం సంతోషదాయకమని చెప్పారు.
దేవతల రాజధాని, రైతుల త్యాగం అమరావతిని దెయ్యాలు విధ్వంసం చెయ్యాలని చూశాయని, అయితే ఎన్ని కుట్రలు చేసిన జై అమరావతి అన్న నినాదాన్ని ఆపలేకపోయారని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మున్సిపల్ మంత్రి పొంగూరి నారాయణ, ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, సిఆర్ డిఎ కమిషనర్ కన్నబాబు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Updated Date - Nov 28 , 2025 | 02:16 PM