Nara Lokesh: కనిగిరిలో రిలయన్స్ సీబీజీ ప్లాంట్ శంకుస్థాపనలో పాల్గొన్న నారా లోకేష్
ABN, Publish Date - Apr 03 , 2025 | 07:51 AM
ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి మండలం దివాకరపల్లి సమీపంలో రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు.
ఇక్కడి పరిస్థితులను బట్టి 50 వేల ఎకరాలు సమకూర్చుతామని స్థానిక ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి చెప్పారని మంత్రి నారా లోకేష్ అన్నారు.
కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి మండలం దివాకరపల్లి సమీపంలో రూ.375 కోట్లతో నిర్మించనున్న రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ జరిగింది.
భూమి పూజ కోసం వచ్చిన మంత్రి నారా లోకేష్‌కు అధికారులు, కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు.
కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, అధికారులు, నేతలు
మంత్రి నారా లోకేష్‌తో ఫొటో దిగుతున్న నేతలు
మంత్రి నారా లోకేష్‌కు పూల బొకే అందజేస్తున్న కూటమి నేతలు
మంత్రి నాారా లోకేష్‌కు స్వాగతం పలుకుతున్న పోలీసు అధికారి
ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల్లో సీబీజీ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
తొలి ప్లాంట్‌ను అత్యంత వెనుకబడ్డ కనిగిరి ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు.
తొలుత జిల్లాలో నాలుగు ప్లాంట్లు అనుకున్నామని మంత్రి నారా లోకేష్ గుర్తుచేశారు.
ప్రకాశం జిల్లా పట్ల తనకు ప్రత్యేక అభిమానం ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
అలా అయితే ఒక్క కనిగిరి ప్రాంతంలోనే 50 ప్లాంట్లను ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని సీబీజీ ప్లాంట్ హబ్‌గా మార్చుతామని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
సీబీజీ ప్లాంట్ వల్ల ఉపాధి పెరిగి రైతులకు లాభం చేకూరి వలసలు తగ్గుతాయని మంత్రి నారా లోకేష్ అన్నారు.
కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతుండగా వింటున్న ప్రజలు
కొందరు ప్లాంట్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు.
గతంలో 2014-19 మధ్య ఎంతో కష్టపడి అనేక కంపెనీలను ఏపీకి తీసుకువస్తే ఆ తర్వాత వైసీపీ పాలకులు పలు కంపెనీలను రాష్ట్రం నుంచి పారదోలారని మంత్రి నారా లోకేష్ విమర్శించారు.
ఇప్పటికీ అభివృద్ధి పనులు, పారిశ్రామిక రంగంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ చెప్పారు.
అలాంటి ప్రచారాలు మానుకోకపోతే వారిని రెడ్‌బుక్‌లోకి ఎక్కిస్తానని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు.
Updated Date - Apr 03 , 2025 | 08:05 AM