Nara Bhuvaneshwari: కుప్పం నియోజకవర్గంలో విద్యార్థులను అప్యాయంగా పలకరించిన నారా భువనేశ్వరి
ABN, Publish Date - Nov 22 , 2025 | 06:53 AM
నాలుగు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. స్థానిక ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈ నేపథ్యంలో వారి సమస్యలను పరిష్కరించాలని స్థానిక అధికారులకు సూచించారు. అంతకుముందు విజలాపురం నుంచి రోడ్డు మార్గంలో వస్తుండగా స్కూలు విద్యార్థులను చూసి కారు దిగి వారిని అప్యాయంగా పలకరించారు. విద్యార్థులతో ఫొటోలు దిగి సందడి చేశారు.
విజలాపురం నుంచి రోడ్డు మార్గంలో వస్తుండగా స్కూలు విద్యార్థులను చూసి కారు దిగి వారిని అప్యాయంగా పలకరించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి.
విద్యార్థులతో మాట్లాడుతున్న నారా భువనేశ్వరి.
శాంతిపురం మండలం కెనమకులపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ వైభవ్ కాంప్లెక్స్‌ను నారా భువనేశ్వరి ప్రారంభించారు.
విద్యార్థులతో ఫొటో దిగుతున్న నారా భువనేశ్వరి.
శ్రీ లక్ష్మీ వైభవ్ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తున్న నారా భువనేశ్వరి.
Updated Date - Nov 23 , 2025 | 08:16 AM