విశాఖలో మంత్రి నారా లోకేష్.. 78వ రోజు ప్రజాదర్బార్
ABN, Publish Date - Dec 16 , 2025 | 12:13 PM
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉదయం 78వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి నుంచి అర్జీలు స్వీకరించారు.
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉదయం 78వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు.
వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కృష్ణంపాలెం గ్రామ భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని బాధితులు మంత్రి లోకేష్ ను కలిసి విన్నవించారు.
2008లో వీసీఐసీ ఫేజ్-1లో భాగంగా పరిశ్రమల అభివృద్ధి కోసం ఏపీఐఐసీ భూసేకరణ చేసి ఏళ్లు గడుస్తున్నప్పటికీ పునరావాసం కల్పించలేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
విశాఖపట్నం కంచరపాలెంలోని ఓల్డ్ ఐటీఐలో ట్రైనింగ్ ఆఫీసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన తనకు రిటైర్ మెంట్ బెనిఫిట్స్ త్వరితగతిన అందజేసేలా చర్యలు తీసుకోవాలని లంకిరెడ్డి సతీశ్వరరెడ్డి మంత్రి నారా లోకేష్‌ను కలిసి కోరారు.
కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం గుత్తైనదీవిలో తన 20 సెంట్ల భూమిని ఆక్రమించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, విచారించి తగిన న్యాయం చేయాలని గాలి దుర్గమ్మ విజ్ఞప్తి చేశారు.
Updated Date - Dec 16 , 2025 | 12:14 PM