Jana Sena:మంగళగిరిలో జనసేన శాసన సభా పక్ష సమావేశం
ABN, Publish Date - Oct 05 , 2025 | 07:34 AM
మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ శాసన సభ పక్ష సమావేశం శనివారం నాడు నిర్వహించారు. మూడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో జనసేన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాలన, రాజకీయపరమైన అంశాలపై ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేతలకి దిశా నిర్దేశం చేశారు.
మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ శాసన సభ పక్ష సమావేశం శనివారం నాడు నిర్వహించారు.
మూడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో జనసేన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో పాలన, రాజకీయపరమైన అంశాలపై ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేతలకి దిశా నిర్దేశం చేశారు.
కూటమిని బలపరుస్తూనే జనసేన పార్టీ బలోపేతానికి ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయాలని మార్గనిర్దేశం చేశారు పవన్ కల్యాణ్.
ఇందుకోసం త్రిశూల వ్యూహాన్ని అమలు చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలు త్వరలోనే తెలియజేస్తామని పేర్కొన్నారు పవన్ కల్యాణ్.
విధివిధానాలను ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు పవన్ కల్యాణ్.
Updated Date - Oct 05 , 2025 | 07:36 AM