సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు.. పాల్గొన్న హోంమంత్రి అనిత
ABN, Publish Date - Apr 21 , 2025 | 07:05 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొని 75కేజీల కేకు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, వివిధ వర్గాల ప్రజలు, నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొని 75కేజీల భారీ కేకు కట్ చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, వివిధ వర్గాల ప్రజలు, కూటమి నేతలు పాల్గొన్నారు.
మహిళకు కేకు తినిపిస్తున్న హెంమంత్రి అనిత
సీఎం చంద్రబాబు బర్త్ డే సందర్భంగా 75 కేజీల భారీ కేకును కట్ చేశారు.
రాష్ట్ర ప్రగతికి మార్గదర్శకులు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా వేడుకలు నిర్వహించామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.
అన్నదానం చేస్తున్న హెంమంత్రి అనిత
సంక్షోభంలోనూ అవకాశాలను సృష్టించగల విజనరీ నాయకుడు చంద్రబాబు అని హెంమంత్రి అనిత వెల్లడించారు. చంద్రబాబు శిష్యురాలిగా ఆయన మంత్రివర్గంలో పనిచేయడం తన పూర్వ జన్మసుకృతమని హెంమంత్రి అనిత అన్నారు.
చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని హెంమంత్రి అనిత తెలిపారు.
చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఉపమాక వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని హెంమంత్రి అనిత వెల్లడించారు.
ఉపమాక వెంకటేశ్వరస్వామి ఆలయంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు.
ఉపమాక వెంకటేశ్వరస్వామి ఆలయంలో హెంమంత్రి అనితను దీవిస్తున్న బ్రాహ్మణులు
సీఎం చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఉపమాక వెంకటేశ్వరస్వామి ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నానని హెంమంత్రి అనిత తెలిపారు.
ఏపీ అభివృద్ధికి సీఎం చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారని హెంమంత్రి అనిత పేర్కొన్నారు.
ఉపమాక వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేస్తున్న హెంమంత్రి అనిత
చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేస్తున్న హెంమంత్రి అనిత
Updated Date - Apr 21 , 2025 | 07:25 AM