కూటమి నాయకుల ఐక్యతే రాష్ట్రాభివృద్ధికి మూలం
ABN, Publish Date - Dec 04 , 2025 | 06:21 PM
కూటమి నాయకుల ఐక్యతే రాష్ట్రాభివృద్ధికి మూలం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 15 ఏళ్లు ఇదే స్ఫూర్తి కొనసాగితే అభివృద్ధి సుస్థిరమవుతుందని పేర్కొన్నారు.
చిత్తూరులో కూటమి పార్టీల నాయకులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
చిత్తూరు రెడ్డిగుంట వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసును ప్రారంభించిన అనంతరం జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి నాయకుల ఐక్యతే రాష్ట్రాభివృద్ధికి మూలమని, 15 ఏళ్లు ఇదే స్ఫూర్తి కొనసాగితే అభివృద్ధి సుస్థిరమవుతుందని పేర్కొన్నారు.
వైసీపీ పాలనలో దిగజారిన వ్యవస్థలను తిరిగి నిలబెడుతున్నామని.. క్షేత్రస్థాయిలో ప్రజల గొంతుకగా మారుదామని నేతలకు సూచించారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో సమూల మార్పులు తీసుకురావాలనే రాష్ట్రవ్యాప్తంగా 77 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసులు ప్రారంభించామని డిప్యూటీ సీఎం తెలిపారు.
సమాజంలో నిస్సహాయులైన వ్యక్తులకు అండగా నిలబడడమే నాయకుడి లక్షణమని, నిస్వార్థంగా మన పని మనం చేసుకుపోతే గుర్తింపు, పదవి వాటికవే వస్తాయని కూటమి నేతలకు సూచించారు.
Updated Date - Dec 04 , 2025 | 06:22 PM