ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Dec 20 , 2025 | 08:12 PM
అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. విద్యార్థినులతో కాసేపు ముచ్చటించారు.
అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు.
తాళ్లపాలెం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ముస్తాబు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
విద్యార్ధుల్లో వ్యక్తిగత శుభ్రతను, ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ఈ కార్యక్రమం చేపట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు.
ముస్తాబు కార్యక్రమం ద్వారా విద్యార్ధుల వ్యక్తిగత శుభ్రత పాటించే విధానాలను సీఎం స్వయంగా పరిశీలించారు.
అనంతరం విద్యార్థినులతో కాసేపు ముచ్చటించారు. విద్యార్థుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్ధుల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మార్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
పరిశుభ్రంగా ఉంటూ చక్కగా చదువుకోవాలని విద్యార్థినులను సూచించారు.
Updated Date - Dec 20 , 2025 | 08:15 PM