ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu Tour In Dubai: దుబాయ్‌లో సీఎం చంద్రబాబు తొలి రోజు పర్యటన..

ABN, Publish Date - Oct 23 , 2025 | 11:36 AM

మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు దుబాయ్ చేరుకున్నారు. తొలి రోజు ఆయన చేపట్టిన పర్యటన సూపర్ సక్సెస్ అయింది. ఈ పర్యటనలో భాగంగా వివిధ కంపెనీల చైర్మన్లు, భారత రాయబార కార్యాలయ ప్రతినిధులతో సీఎంచంద్రబాబు బృందం సమావేశమైంది.

1/12

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్‌ పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. తొలి రోజు పర్యటనలో భాగంగా సీఐఐ భాగస్వామ్య సదస్సు రోడ్ షోలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సదస్సుకు వివిధ కంపెనీల ప్రతినిధులు భారీగా హాజరయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని.. అవసరమైతే విధానాల్లో మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

2/12

రాష్ట్రంలో లాజిస్టిక్స్, గిడ్డంగులు ఏర్పాటుపై ప్రతిపాదనలు పరిశీలించాలని ఈ సందర్భంగా షరాఫ్ గ్రూప్‌ను సీఎం చంద్రబాబు కోరారు. దుగరాజుపట్నంలో నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటులో భాగస్వామ్యం కావాలంటూ సీఎం చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ సానుకూలంగా స్పందించింది.

3/12

ఈ సందర్భంగా ఆ సంస్థ చైర్మన్‌తో సీఎం సమావేశమై.. రాష్ట్రానికి సుదీర్ఘంగా ఉన్న తీర ప్రాంతంతోపాటు ఓడరేవుల అంశాన్ని ఆయనకు సీఎం చంద్రబాబు వివరించారు. దీంతో ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ సానుకూలంగా స్పందించింది.

4/12

రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని దుబాయ్‌లోని ప్రముఖ రియాల్టీ సంస్థ శోభా గ్రూప్ ప్రతినిధులను సీఎం చంద్రబాబు కోరారు. ఈ నేపథ్యంలో అమరావతిలో ప్రపంచస్థాయి గ్రంథాలయ నిర్మాణానికి రూ. 100 కోట్ల విరాళానని ప్రకటించింది. ఈ సంస్థ చైర్మన్‌ పీఎన్‌సీ మేనన్‌ను సీఎం అభినందించారు.

5/12

తిరుపతిలో క్యాన్సర్ సెంటర్ ఏర్పాటుకు బుర్జిల్ హెల్త్ కేర్ అంగీకారించింది.

6/12

ఇక విశాఖపట్నం వేదికగా నవంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు రావాలంటూ వారిని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు.

7/12

దుబాయ్, అబుదాబిల్లోని భారత రాయబారి కార్యాలయ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.

8/12

సీఎం చంద్రబాబు మూడు రోజుల పాటు దుబాయి, అబుదాబి, యూఏఈలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు వెంట మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.

9/12

అలాగే దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియంను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం సందర్శించింది. దీనిని లివింగ్ మ్యూజియం‌గా రూపొందించారు.

10/12

అంతరిక్షం, వాతావరణం, ఆరోగ్యం, విద్య, వైద్యం, ఏఐ తదితర రంగాల్లో భవిష్యత్ ఆవిష్కరణలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది టెక్నాలజీని వినియోగించి మ్యూజియంలో ప్రదర్శనలు చేస్తున్నట్లు దుబాయ్ ఉన్నతాధికారులు సీఎం చంద్రబాబు బృందానికి వివరించారు.

11/12

అలాగే ఫ్యూచర్ జర్నీ పేరుతో ఏర్పాటు చేసిన ఎక్సీపీరియన్స్ జోన్‌ను సైతం సీఎం చంద్రబాబు బృందం సందర్శించింది.

12/12

ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రాభివృద్ధి కోసం వీలైనంత ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు.

Updated Date - Oct 23 , 2025 | 11:47 AM