AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ
ABN, Publish Date - Oct 11 , 2025 | 07:56 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం శుక్రవారం జరిగింది.
ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
మంత్రులకు ఏపీ అభివృద్ధి గురించిన పలు అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
విశాఖపట్నం 2028 నాటికి దేశంలో ఒక ప్రత్యేక సిటీగా ఉండబోతుందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
2028 నాటికి విశాఖపట్నంలో ఐటీ రంగంలో లక్షలాది ఉద్యోగాలు రాబోతున్నాయని స్పష్టం చేశారు.
ముంబై తరహాలో విశాఖపట్నం అభివృద్ధి చెందబోతుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్‌లో 4 లక్షల 70 వేల మంది ఉన్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Updated Date - Oct 11 , 2025 | 08:00 AM