రైతన్నా.. మీకోసం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Dec 03 , 2025 | 07:50 PM
తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో నిర్వహించిన రైతన్నా..మీకోసం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. నల్లజర్ల రైతాంగం సాగు చేస్తోన్న పంటలను సీఎం పరిశీలించారు.
తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో నిర్వహించిన రైతన్నా..మీకోసం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
నల్లజర్ల రైతాంగం సాగు చేస్తోన్న పంటల వివరాలను తెలుసుకుని పలు సూచనలు చేశారు.
అనంతరం రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మెరుగైన సాగు విధానాలను పాటించిన రైతులను సన్మానించారు.
ఏపీలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి, రైతు ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
రైతుల అభివృద్ధి కోసం పంచసూత్రాలను అమలు చేస్తున్నామని, ప్రతి రైతు వీటిని ఆచరించి లబ్ధి పొందాలని పిలుపునిచ్చారు.
Updated Date - Dec 03 , 2025 | 07:52 PM