కడపలో కమ్ముకున్న కారు మబ్బులు
ABN, Publish Date - Jun 15 , 2025 | 08:25 AM
వాతావరణంలో వచ్చే మార్పులతో కారుమబ్బులు ఆకాశాన్ని కమ్మేశాయి. కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్లో శనివారం (జూన్ 14 ) సాయంత్రం 7 గంటల సమయంలో ఆకాశం కారుమబ్బులతో నిండిపోయింది. మబ్బులు క్రమంగా కదులుతూ, వాతావరణానికి ఒక ప్రత్యేకమైన అందాన్ని ఇచ్చాయి.
వాతావరణంలో వచ్చే మార్పులతో కారుమబ్బులు ఆకాశాన్ని కమ్మేశాయి.
మబ్బులు క్రమంగా కదులుతూ, వాతావరణానికి ఒక ప్రత్యేకమైన అందాన్ని ఇచ్చాయి.
ఈ కారు మబ్బులను కొంతమంది తమ మొబైల్ ఫోన్లలో ఫొటోలు తీసుకున్నారు.
ఆకాశం వైపు చూస్తూ, ఈ దృశ్యాన్ని ఆస్వాదించారు.
ఈ దృశ్యం కడప నగరానికి ప్రత్యేకమైన అందాన్ని ఇచ్చింది.
ఈ కారు మబ్బులు కమ్మేసిన కాసేపటికే కడప నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
శనివారం మధ్యాహ్నం ఎండ దంచికొట్టగా సాయంత్రం సమయంలో ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమైంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ఏకధాటిగా అరగంటకు పైగా కురిసింది.
Updated Date - Jun 16 , 2025 | 02:20 PM