AP CM Chandrababu: జాతీయ ఈ-గవర్నెన్సు సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Sep 22 , 2025 | 07:13 PM
కేంద్ర ఐటీ సమాచార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ ఈ- గవర్నెన్సు సభకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సివిల్ సర్సీసెస్ - డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ థీమ్‌తో జరుగుతున్న 28వ జాతీయ ఈ-గవర్నెన్సు సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు.
కేంద్ర ఐటీ సమాచార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ ఈ-గవర్నెన్సు సభకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సివిల్ సర్సీసెస్ -డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ థీమ్‌తో జరుగుతున్న 28వ జాతీయ ఈ-గవర్నెన్సు సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు.
పాలనలో డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ అత్యంత ముఖ్యమైన అంశమని వ్యాఖ్యానించారు. సాంకేతికతతోనే ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
ప్రభుత్వ శాఖల ద్వారా అందే పౌర సేవలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి సాంకేతికత కీలకమని తెలిపారు సీఎం చంద్రబాబు.
సభకు హాజరైన పలువురు ప్రముఖులు
కమ్యూనికేషన్ సంస్కరణల ద్వారా ప్రజా జీవనంలోనూ విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని ఉద్ఘాటించారు సీఎం చంద్రబాబు.
సాంకేతికతను అందిపుచ్చుకుని గతంలోనే ఉమ్మడి ఏపీలో ఈ-సేవ, మీ-సేవ ద్వారా ప్రభుత్వ శాఖలు అందించే పౌర సేవలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లామని వెల్లడించారు సీఎం చంద్రబాబు.
ఈ-ఫైల్స్, ఈ-కేబినెట్ లాంటి అంశాలతో వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఆస్కారం ఏర్పడిందని అన్నారు. అలాగే ఈ వ్యవస్థలను అమలు చేసే సమయంలో సైబర్ సెక్యూరిటీ కూడా అత్యంత కీలకమని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.
ఐటీతో వచ్చిన విస్తృత ప్రయోజనాలను అందిపుచ్చు కోగలుగుతున్నామని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.
ఈ ప్రక్రియను మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్సును అమలు చేస్తున్నామని వివరించారు సీఎం చంద్రబాబు.
మొత్తం 751 పౌరసేవలను వాట్సాప్ ద్వారా పౌరులకు అందిస్తూ పాలనను వారి మొబైల్ ఫోన్ల వరకూ తీసుకెళ్లామని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.
మరోవైపు సాంకేతికత కారణంగా పొరుగు రాష్ట్రాలతోనూ పోటీ పెరిగిందని పేర్కొ న్నారు సీఎం చంద్రబాబు.
Updated Date - Sep 22 , 2025 | 07:18 PM