Chandrababu Naidu In Nandagokulam: నందగోకులంలో సీఎం చంద్రబాబు..
ABN, Publish Date - Oct 10 , 2025 | 07:15 PM
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఈదగాలి గ్రామంలో విశ్వసముద్ర గ్రూప్ నిర్మించిన బయో ఎనర్జీ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు ప్రజాప్రతినిధులు, పలువురు సీనియర్ నేతలతోపాటు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
బొగ్గు, నీరు, సోలార్, గాలితో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని.. కానీ ప్రస్తుతం ఎద్దులను ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేయడం తొలిసారి చూస్తున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఈదగాలి గ్రామంలో విశ్వసముద్ర గ్రూప్ నిర్మించిన బయో ఎనర్జీ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అంతకు ముందు గో సంరక్షణా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. సమాజం వల్ల పైకి వచ్చిన ప్రతి ఒక్కరూ.. సమాజానికి తిరిగి ఇవ్వాలని పిలుపు నిచ్చారు.
2024 నాటికి ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుందని.. అందులోనూ ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
అలాగే రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
విశ్వసముద్ర ప్రాజెక్టులను ప్రారంభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. వినూత్న ప్రయోగాల ద్వారా మూడు ప్రాజెక్టులు నెలకొల్పారన్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఒంగోలు జాతి ఎద్దులు కనుమరుగయ్యాయని.. కానీ బ్రెజిల్ దేశంలో మాత్రం ఈ జాతి బ్రీడ్‌ను ప్రపంచానికి అందించే పరిస్థితికొచ్చారని చెప్పారు.
నందగోకులం - సేవ్ ది బుల్ కార్యక్రమం చాలా విశిష్టమైనది తెలిపారు. పేద విద్యార్థులను తీసుకొచ్చి నందగోకులం లైఫ్ స్కూల్‌లో శిక్షణ ఇస్తున్నారన్నారు.
సాధారణ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. అలా సమాజం వల్ల పైకి వచ్చిన ప్రతి ఒక్కరూ సమాజానికి తిరిగి ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబు పిలుపు నిచ్చారు.
ఈ సందర్భంగా కంప్యూటర్ ల్యాబ్‌లో విద్యార్థులతో ముచ్చటించారు.
అలాగే తరగతి గదులను సీఎం చంద్రబాబు పరిశీలించారు.
ఈదగాలి గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, పలువురు సీనియర్ నేతలతోపాటు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
Updated Date - Oct 10 , 2025 | 09:50 PM