విశాఖలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం..
ABN, Publish Date - Jun 21 , 2025 | 10:22 AM
విశాఖపట్నం కేంద్రంగా యోగాంధ్ర కనీ వినీ ఎరగని స్థాయిలో నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. ఆర్కే బీచ్ నుంచి భీమిలి తీరం వరకు దాదాపు 26 కిలోమీటర్ల పరిధిలో లక్షల మంది యోగాసనాలు వేశారు.
దేశవ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నారు.
ఇక, విశాఖపట్నం కేంద్రంగా జరుగుతున్న యోగాంధ్ర కనీ వినీ ఎరగని స్థాయిలో జరుగుతోంది.
ఆర్కే బీచ్ నుంచి భీమిలి తీరం వరకు దాదాపు 26 కిలోమీటర్ల పరిధిలో లక్షల మంది యోగాసనాలు వేస్తున్నారు.
విశాఖపట్నంలో జరుగుతున్న ఈ యోగాంధ్ర కార్యక్రమంలో 3 లక్షల మంది ప్రజలు ప్రజలు పాల్గొన్నారు.
దీంతో ఈ కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో (Guinness Record) స్థానం దక్కించుకుంది.
ఇంతకు ముందు సూరత్‌లో 1.5 లక్షల మంది ఒకేసారి యోగాసనాలు వేసి రికార్డ్ సృష్టించారు.
ఆ రికార్డును తాజాగా విశాఖ యోగాంధ్ర కార్యక్రమం దాటేసింది.
సూరత్ రికార్డ్‌ను అధిగమించడడంతో ప్రభుత్వ వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
Updated Date - Jun 21 , 2025 | 12:49 PM