ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mini Mahanadu: పోర్ట్‌లాండ్‌లో ఘనంగా మినీ మహానాడు వేడుకలు

ABN, Publish Date - Jun 05 , 2025 | 04:24 PM

Mini Mahanadu: పోర్ట్‌లాండ్‌లో టీడీపీ మహానాడును ఎంతో ఘనంగా నిర్వహించారు. టీడీపీ పాలనలో చేపట్టిన ఎన్నో వ్యవసాయ ఆధారిత, ఐటీ సంబంధింత కార్యక్రమాలపై ప్రసంగించారు.

Mini Mahanadu

పోర్ట్‌లాండ్‌: అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రం పోర్ట్‌లాండ్‌లో టీడీపీ మినీ మహానాడు (TDP Mini Mahanadu) వేడుక మే 31 (శనివారం) ఎంతో ఘనంగా జరిగింది. తమ అభిమాన పార్టీ కోసం మహిళలు, యువత ముందు ఉండి మరీ ఈ కార్యక్రమాన్ని నడిపించారు. సీనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు, టీడీపీ గత సంవత్సర కాలం పాలన, బాలయ్యకు పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా సంబరాలు చేసుకున్నారు. ఇందులో భాగంగా మా తెలుగు తల్లికి పాటకు మహిళలు, బాలయ్య పాటలకు చిన్నారులు స్టెప్పులు వేసి అలరించారు.


అనంతరం టీడీపీ పాలనలో చేపట్టిన ఎన్నో వ్యవసాయ ఆధారిత, ఐటీ సంబంధిత కార్యక్రమాలపై ప్రసంగించారు. అంతే కాకుండా బాలయ్య, టీడీపీ, మహానాడుపై క్విజ్ వంటి మరెన్నో ఆహ్లాదభరితమైన కార్యక్రమాలను నిర్వహించారు. టీడీపీ చేస్తున్న ప్రజోపయోగ కార్యక్రమాలపై ఎన్‌ఆర్‌ఐలు నరహరి రామినేని, మారుతి యరపతినేని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంచి విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు.



ఇవి కూడా చదవండి

లాస్ఏంజెల్స్‌లో ఘనంగా మినీ మహానాడు

సిలికానాంధ్ర సంస్థ మరో సరికొత్త రికార్డు

Read Latest NRI News And Telugu News

Updated Date - Jun 05 , 2025 | 04:26 PM