Silicon Andhra: సిలికానాంధ్ర సంస్థ మరో సరికొత్త రికార్డు
ABN , Publish Date - Jun 04 , 2025 | 11:09 AM
సిలికానాంధ్ర సంస్థ మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ వారాంతంలో బే-ఏరియాలో ఆ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే మూడు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ఒకేసారి పట్టభద్రులయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: సిలికానాంధ్ర (Silicon Andhra) సంస్థ మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ వారాంతంలో బే-ఏరియాలో ఆ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే మూడు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ఒకేసారి పట్టభద్రులయ్యారు. మూడు స్నాతకోత్సవాలు నిర్వహించినట్లు సిలికానాంధ్ర సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ వెల్లడించారు.
![]()
SAMPADA (Silicon Andhra Music, Performing Arts and Dance Academy) నుంచి 230 విద్యార్థులు, సిలికానాంధ్ర మనబడి నుంచి 412 మంది, ఆరియా విశ్వవిద్యాలయం నుంచి 62 మంది.. మొత్తం 704 మంది విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. ఈ రికార్డు సాధన వెనుక కృషి చేసిన అధ్యాపకులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, సిలికానాంధ్ర నిర్వాహకులకు ఆనంద్ అభినందనలు తెలిపారు.
![]()
ఇవి కూడా చదవండి
రీల్స్ చేస్తుండగా విషాదం.. ఆరుగురు అమ్మాయిలు మృతి
ప్రియురాలితో గొడవ.. ఇదేం పని నాయనా..