Viral Video: ప్రియురాలితో గొడవ.. ఇదేం పని నాయనా..
ABN , Publish Date - Jun 04 , 2025 | 08:17 AM
High Voltage Drama: ప్రియురాలిని బెదిరిద్దామనుకున్నాడో.. లేక చనిపోవాలనుకున్నాడో తెలీదు కానీ.. హై ఓల్టేజ్ కరెంట్ లైన్ టవర్‌ను ఎక్కాడు. ఇది గమనించిన ఓ వ్యక్తి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు.
’ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం..’ అని అభినందన సినిమాలో ఓ పాట ఉంటుంది. సృష్టి మొదలైన నాటినుంచి ఇప్పటి వరకు స్త్రీ అర్థంకాని.. అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. ప్రేమలో ఉన్న లేదా పెళ్లి చేసుకుని ఉన్నా.. మగాళ్లకు ఇబ్బందులు మాత్రం తప్పటం లేదు. ఏ కారణం లేకపోయినా.. కారణం లేని కారణంగా గొడవపడే ఆడవాళ్లు ఎందరో.. తాజాగా, ఓ యువకుడు ప్రియురాలితో గొడవ పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఏకంగా 40 అడుగులు ఎత్తైన ప్రమాదకరమైన కరెంట్ లైన్ ఎక్కాడు.
అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, రాయబరేలీకి చెందిన అంకిత్ సింగ్.. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం అంకిత్ ఉస్రైనా గ్రామంలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. సోమవారం సాయంత్రం ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండగా.. అంకిత్‌కు అతడి ప్రియురాలికి మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ చినికి చినికి గాలి వానలా తయారైంది.
అంకిత్ ఆగ్రహానికి గురయ్యాడు. ఊరి బయటకు పరుగులు తీశాడు. ప్రియురాలిని బెదిరిద్దామనుకున్నాడో.. లేక చనిపోవాలనుకున్నాడో తెలీదు కానీ.. హై ఓల్టేజ్ కరెంట్ లైన్ టవర్‌ను ఎక్కాడు. ఇది గమనించిన ఓ వ్యక్తి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. పెద్ద ఎత్తున జనం అక్కడికి వచ్చారు. అంకిత్ బంధువులు కూడా వచ్చారు. కిందకు దిగమని బతిమాలారు. పోలీసులకు కూడా సమాచారం వెళ్లింది. వారు అక్కడికి చేరుకుని అతడికి సర్ధి చెప్పారు. ఈ హైడ్రామా సాయంత్రం నుంచి అర్థరాత్రి 2 గంటల వరకు సాగింది. అతి కష్టం మీద అతడ్ని కిందకు దించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, అంకిత్‌కు అతడి ప్రియురాలికి మధ్య ఏ విషయంలో గొడవ అయిందో తెలియరాలేదు.
ఆర్సీబీ గెలుపు.. ఈ మహిళ భర్త సేఫ్..
పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..