ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tana Atlanta Team: అట్లాంటాలో ఫోర్సిత్‌ కౌంటీ షెరీఫ్‌ సిబ్బందికి తానా నాయకుల సత్కారం

ABN, Publish Date - Jun 25 , 2025 | 10:10 PM

కమ్యూనిటీకి సేవలందించడంలో తమ జీవితాన్ని అంకితం చేసిన ధైర్యవంతులైన అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతను తెలియజేయాలనే లక్ష్యంతో తానా అట్లాంటా టీమ్‌ సేవ చేసేవారికి తమవంతు సేవ చేయడం అన్న భావనతో ఓ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.

Tana Atlanta Team

ఇంటర్నెట్ డెస్క్: కమ్యూనిటీకి సేవలందించడంలో తమ జీవితాన్ని అంకితం చేసిన ధైర్యవంతులైన అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతను తెలియజేయాలనే లక్ష్యంతో తానా అట్లాంటా టీమ్‌ (Tana Atlanta Team) సేవ చేసేవారికి తమవంతు సేవ చేయడం అన్న భావనతో ఓ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. కమ్మింగ్‌‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఫోర్సిత్‌ కౌంటీ షెరీఫ్‌ కార్యాలయం ` సౌత్‌ ప్రీసింక్ట్‌ సిబ్బందికి అభినందనలు తెలియజేస్తూ విందు భోజనాన్ని తానా నాయకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా షెరీఫ్‌ కార్యాలయంతో సమన్వయం చేయడంలో చొరవ చూపిన శ్రీరామ్‌ రాయలకు, ఈవెంట్‌ నిర్వహణ బాధ్యతలు తీసుకున్న శేఖర్‌ కొల్లుకు తానా అట్లాంటా నాయకులు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి షెరీఫ్‌ కార్యాలయ సిబ్బంది, కమ్యూనిటీ నాయకులు హాజరయ్యారు. తానా మాజీ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, బోర్డ్‌ సభ్యుడు శ్రీనివాస్‌ లావుతోపాటు ఇతర తానా నాయకులు మాలతి నాగభైరవ, సోహినీ అయినాల, శేఖర్‌ కొల్లు, సునీల్‌ దేవరపల్లి, శ్రీనివాసులు రామిశెట్టి, మురళి బొడ్డు, శ్రీనివాస్‌ ఉప్పు, పూలని జాస్తి, మధుకర్‌ యార్లగడ్డ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో యువ తానా నాయకులు పాల్గొనడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. అమితా యార్లగడ్డ, ఆరుషి నాగభైరవ, అవనీష్‌ లావు వంటి యువతరం ఈ కార్యక్రమంలో భాగస్వాములవడం అందరినీ ఆకట్టుకుంది. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో తానా నాయకులు ఎల్లప్పుడూ ముందుంటున్నారని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

సీఎం సూచనతో విదేశాల్లో వెంకన్న మందిరాల నిర్మాణానికి కృషి: టీటీడీ ఛైర్మన్

అమెరికాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

Read Latest and NRI News

Updated Date - Jun 25 , 2025 | 10:15 PM