Share News

International Yoga Day: అమెరికాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

ABN , Publish Date - Jun 19 , 2025 | 07:29 AM

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వాషింగ్టన్ డీసీలో ఎన్నారైలు యోగా అభ్యసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, మహిళలు, పెద్దలతో సహా అంతా పాల్గొన్నారు.

International Yoga Day: అమెరికాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
International Yoga Day USA

వాషింగ్టన్(అమెరికా): ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతో అవసరమని మన్నవ సుబ్బారావు అన్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ప్రవాస భారతీయుల ఆధ్వర్యంలో యోగా అభ్యసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయుల తల్లిదండ్రులు యోగా సాధన చేశారు. ఈ కార్యక్రమాన్ని భాను మాగులూరి సమన్వయ పరిచారు.

మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. యోగా ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరమని అన్నారు. యోగా వ్యాయామం మాత్రమే కాదు.. జీవన విధానమని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో యోగాంధ్రను పెద్ద ఎత్తున చేపడుతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు.

1.jpg


భాను మాగులూరి మాట్లాడుతూ.. పెద్దలంతా తమ ఆరోగ్యాన్ని కాపాడుకొని తమ జీవిత అనుభవాలను భవిష్యత్ తరాలకు అందించాలని కోరారు. యోగా సాధన వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన పెంచడమే అంతర్జాతీయ యోగా దినోత్సవం లక్ష్యమని అని అన్నారు. యోగా సాధనలో చిన్నారులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎండూరు సీతారామారావు, గోవన మోహనరావు, చెరుకూరి ఇందు శేఖర్, నంబూరి చంద్రనాథ్, బండితోపు సత్యనారాయణ, చిట్టెల సుబ్బారావు, బూర్ల రామకృష్ణ, వనపర్తి నాగిరెడ్డి, వనమా లక్ష్మీనారాయణ, చామర్తి శ్రావ్య తదితరులు పాల్గొన్నారు.

3.jpg


4.jpg5.jpg6.jpg7.jpg

ఇవీ చదవండి:

ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు.. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్‌ లైన్ ఏర్పాటు

అల్లుళ్ల కట్నకానుకల కోసం అరబ్బునాట తెలుగు అమ్మ కష్టం

Read Latest and NRI News

Updated Date - Jun 19 , 2025 | 07:34 AM