Telangana Bhavan: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు.. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ ఏర్పాటు
ABN , Publish Date - Jun 17 , 2025 | 10:23 PM
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అక్కడి తెలాంగాణ వాసుల సహాయార్థం రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది.

న్యూ ఢిల్లీ, 17th జూన్: ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న లేదా ప్రయాణిస్తున్న తెలంగాణ వాసులు, విద్యార్థులకు సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది.
విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రెండు దేశాల భారత రాయబార కార్యాలయాల నుంచి లభించిన తాజా సమాచారం ప్రకారం, ఇప్పటి వరకు తెలంగాణకు చెందినవారెవరూ ప్రభావితమైనట్టు సమాచారం లేదు. అయినప్పటికీ, భవిష్యత్ పరిణామాల దృష్ట్యా ముందు జాగ్రత్తగా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశానుసారం, తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో, ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదిస్తూ అవసరమైతే తక్షణ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.
సహాయం కోసం ప్రజలు కింది నెంబర్లను సంప్రదించవచ్చు:
వందన.పి.ఎస్, రెసిడెంట్ కమిషనర్ – +91 9871999044
జి. రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్ – +91 9643723157
జావేద్ హుస్సేన్, లైజన్ ఆఫీసర్ – +91 9910014749
సిహెచ్. చక్రవర్తి, పౌర సంబంధాల అధికారి – +91 9949351270
ఇవి కూడా చదవండి:
బే ఏరియాలో ఘనంగా కృష్ణ 82వ జయంతి వేడుకలు