ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TANA: బాల సాహిత్య భేరి.. విద్యార్థులకు తానా కీలక సూచన

ABN, Publish Date - Nov 05 , 2025 | 07:21 PM

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తానా సాహిత్య విభాగం.. తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాల సాహిత్య భేరిని నిర్వహిస్తుంది. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా బాల సాహితీవేత్తలకు ఆహ్వానం పలుకుతోంది.

TANA

వాషింగ్టన్, నవంబర్ 05: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తానా సాహిత్య విభాగం.. తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ 'బాల సాహిత్య భేరి'ని నిర్వహిస్తుంది. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా బాల సాహితీవేత్తలకు ఆహ్వానం పలుకుతోంది. 2025, నవంబర్ 30వ తేదీన బాల సాహిత్య భేరి పేరుతో అంతర్జాతీయ అంతర్జాల శతాధిక బాల కవుల సమ్మేళనం నిర్వహిస్తున్నామని తానా ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కార్యక్రమంలో విశ్వవ్యాప్తంగా ఉన్న బాల, బాలికలు.. కథ, వచన కవిత, గేయం, పద్యం తదితర విభాగాల్లో తమ స్వీయ రచనలను వినిపించాలని సూచించింది.

ఒక్కొక్కరికి 3 నిమిషాల సమయం కేటాయించినట్లు వివరించింది. 5 నుంచి 15 సంవత్సరాల గల బాల, బాలికలు.. పైన తెలిపిన విభాగాల్లో ఏదో ఒక అంశానికి సంబంధించి ఒక పేజీ మించకుండా రాయాలని కోరింది. అలాగే వారి పేరు, ఊరు, తరగతి, దేశం, ఫోన్ # తదితర వివరాలను +91 9121081595 వాట్సాప్ నంబర్‌కు గడువులోపు అంటే.. నవంబర్ 14వ తేదీలోపు పంపాలని తానా స్పష్టం చేసింది.

ఈ ఎంపికైన విద్యార్థులకు నవంబర్ 30వ తేదీన తానా అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పిస్తామని పేర్కొంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభమై.. రాత్రి 10 గంటల వరకు.. అంటే 13 గంటలపాటు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుందని చెప్పింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనే బాల, బాలికలకు ప్రశంసా పత్రాలు అందజేస్తామని తానా అధ్యక్షుడు డా.నరేన్ కొడాలి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా.ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి

కువైత్‌లో కార్మిక చట్టాలపై అవగాహన కార్యక్రమం

అమెరికాలో తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాం: నాట్స్

Read Latest and NRI News

Updated Date - Nov 05 , 2025 | 07:55 PM