Exams Successfully held In TANA College: తానా కళాశాల్లో విజయవంతంగా ముగిసిన పరీక్షలు
ABN, Publish Date - Oct 01 , 2025 | 08:45 PM
అమెరికాలోని న్యూ ఇంగ్లాండ్ బోస్టన్‌లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కళాశాలలో కూచిపూడి, భరతనాట్యం పరీక్షలు విజయవంతంగా నిర్వహించినట్లు నిర్వాహాకులు వెల్లడించారు.
వాషింగ్టన్: అమెరికాలోని న్యూ ఇంగ్లాండ్ బోస్టన్‌లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కళాశాలలో కూచిపూడి, భరతనాట్యం పరీక్షలు విజయవంతంగా నిర్వహించినట్లు నిర్వాహాకులు వెల్లడించారు. కూచిపూడి, భరతనాట్యం, కర్ణాటక సంగీతంలో కోర్సులకు అమెరికా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయని తెలిపారు. ఈ పరీక్ష విధానంలో తీసుకువచ్చిన మార్పులు అందరికి ప్రేరణగా నిలిచాయని తానా కళాశాల చైర్మన్ శ్రీమతి మాలతీ, తానా ప్రెసిడెంట్ డాక్టర్ నరేన్ కొడాలి సంతృప్తి వ్యక్తం చేశారు.
తానా న్యూ ఇంగ్లాండ్ రీజినల్ కోఆర్డినేటర్ మౌనిక మానికొండ ఆధ్వర్యములో నిర్వహించిన ఈ కళాశాల పరీక్షలకు ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ కృష్ణ ప్రసాద్ సోంపల్లి ఇన్విజిలేటర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా మౌనిక మానికొండ మాట్లాడుతూ.. మన సంప్రదాయాలను వ్యాప్తి చేస్తున్న తానా కళాశాల కార్యక్రమం అందరకి స్ఫూర్తిదాయకమని చెప్పారు.
అలాగే ఈ కళాశాలలో ఉపాధ్యాక్షురాలు శైలజ ఈడుపుగంటి, తానా ఫౌండేషన్ ట్రస్టీ శ్రీనివాస్ ఎండూరి ఈ న్యూ ఇంగ్లాండ్ బోస్టన్ కళాశాలలో ఇద్దరు వైద్యులు విద్యార్థులుగా వుండడం ఈ కార్యక్రమం యొక్క విశిష్టతను వివరిస్తుందని వివరించారు.
తానా అనేక కార్యక్రమాలు చేపడుతుందని.. అందులో మన సంప్రదాయాలు పెంపొందిస్తున్న ఈ కళాశాల కార్యక్రమం అగ్రస్థానంలో ఉందన్నారు. న్యూ ఇంగ్లాండ్ బోస్టన్ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆరు రాష్ట్రాల నుంచి వచ్చేసిన విద్యార్థులకు మౌనిక మానికొండ కృతజ్ఞతలు తెలిపారు.తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఈ తానా కళాశాల నడుస్తుంది.
ఇవి కూడా చదవండి..
దారుణం.. చనిపోయిన ఐదేళ్ల తర్వాత అంత్యక్రియలు
For More NRI News And Telugu News
Updated Date - Oct 01 , 2025 | 08:52 PM