NRI news: దుబాయిలో ఇంకా పరిమళిస్తున్న బతుకమ్మ పూలు
ABN, Publish Date - Oct 08 , 2025 | 05:47 PM
దుబాయిలోని తెలుగు ప్రవాసీ సంఘమైన తెలుగు అసోసియెషన్ ఇటీవల బతుకమ్మ సంబురాలను అంగరంగ వైభవంగా నిర్వహించింది. ప్రప్రథమంగా దుబాయిలోని భారతీయ కాన్సుల్ జనరల్ సతీశ్ కుమార్ శివన్ తో పాటు స్థానిక ఇమరాతీ జాతీయులైన కొందరు ప్రముఖులు, దుబాయి ప్రభుత్వ అధికారులు కూడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: పూల అమరిక నుండి పాటల ఆలాపన వరకు ప్రతిదీ ఇప్పటికి దుబాయిలోని తెలుగు ప్రవాసీ కుటుంబాలలో మనోహరంగా అవిష్కృతమవుతుంది. పూల పండుగ బతుకమ్మ సంబురాలు ముగిసినా అనేక తెలుగు ప్రవాసీ కుటుంబాలు ఇప్పటికి అందులోని పరిమళాలను అస్వాదిస్తున్నారు.
దుబాయిలోని తెలుగు ప్రవాసీ సంఘమైన తెలుగు అసోసియెషన్ ఇటీవల బతుకమ్మ సంబురాలను అంగరంగ వైభవంగా నిర్వహించింది. ప్రప్రథమంగా దుబాయిలోని భారతీయ కాన్సుల్ జనరల్ సతీశ్ కుమార్ శివన్ తో పాటు స్థానిక ఇమరాతీ జాతీయులైన కొందరు ప్రముఖులు, దుబాయి ప్రభుత్వ అధికారులు కూడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ సాంస్కృతిక వైభవ కిరీటం బతుకమ్మ. ఈ పండుగకు ఆభరణం లాంటిది స్త్రీ. ఆమె శోభతో బతుకమ్మ దుబాయిలో వేడుకలు జరిగిన న్యూ డాన్ పాఠశాల ప్రాంగణం వెలిగిపోయింది.
కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా దుబాయిలోని తెలుగు ప్రవాసీయులను సమైక్యపర్చడం తమ ప్రధాన ఆశయమని తెలుగు అసోసియెషన్ అధ్యక్షులు మసీయోద్దీన్, ప్రధాన కార్యదర్శి దినేష్ ఉగ్గిన పెర్కొన్నారు. భారతీయ సంస్కృతిని స్థానిక ఇమరాతీ జాతీయులకు తెలియజేయాలనే ఉద్దేశంతో బతుకమ్మ సంబురాలకు వారిని ఆహ్వనించామని తెలిపారు. దుబాయిలోని తెలుగు ప్రవాసీయుల సాంస్కృతిక, సంక్షేమం గురించి తమ సంఘం అనేక ప్రణాళికలను రూపొందించినట్లుగా మసీయోద్దీన్, దినేష్ వెల్లడించారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లుగా కూడ వారు పేర్కొన్నారు.
భారతదేశం నుంచి ప్రత్యేకంగా వచ్చిన ప్రముఖ తెలంగాణ జానపద గాయకులు అష్ఠ గంగాధర్, ప్రభమ, లావణ్యలు తమ గేయాలతో దుబాయిలోని ప్రవాసీయులను ఎక్కడో తెలంగాణలోని పంట పొలాల్లో పని చేసుకోంటూ పాడుకున్న వైనాన్ని తలపించారు. దుబాయి ప్రభుత్వ ఆమోదం కలిగిన ఏకైక తెలుగు ప్రవాసీ సంఘమైన తెలుగు అసోసియేషన్ అధ్వర్యంలో జరిగిన ఈ సంబురాలను.. అసోసియేషన్ అధ్యక్షుడు మసీయోద్దీన్, ప్రధాన కార్యదర్శ దినేష్ ఉగ్గిన, సాంస్కృతిక వ్యవహారాల బాధ్యుడు శ్రీధర్ దామర్ల, మహిళల విభాగం బాధ్యురాలు లతా నగేశ్, సంక్షేమ విభాగం భాద్యులు చిన్న సత్తన్న రుద్రారపులు.. అన్నీ తామై నిర్వహించి, అందరి అభిమానాలను చూరగొన్నారు.
ఈ కార్యక్రమానికి కిసాన్ పరివార్ లిమిటెడ్ వారు ప్రధాన సమర్పకులుగా వ్యవహరించారు. అలాగే LSPMK గ్రూప్, పోథ్ గాల్ స్వీట్స్, అంజన్ మెక్ (గార్డీన్స్ ఆఫ్ సేఫ్టీ), MAC, MERALDA జూవెల్లర్స్, సంతోషి బిల్డింగ్ మైంటెనెన్స్, బ్రిజ రియాల్టీ, వి స్మార్ట్ టెక్నికల్ సర్వీసెస్, రాయల్ బులియన్ కాపిటల్, టి హోమ్స్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారు సమర్పకులుగా వ్యవహరించారు. అదేవిధంగా సిరి ఫుడ్స్, ఫార్చూన్ గ్రూప్ ఆఫ్ హోటెల్స్ వారు హాస్పిటాలిటి సమర్పకులుగా, సూపర్ జెట్ టూర్స్ ట్రావెల్ సమర్పకులుగా, సూపర్ మాల్, మ్యాజిక్ ఫ్లవర్స్, ఎఎంజి డిజిటెక్ సొల్యూషన్స్, స్పెక్ట్రం ఆడిటింగ్, శుభం డెకార్స్ సమర్పకులుగా, లెమన్ స్టూడియో వారు ఫోటో అండ్ వీడియో స్పాన్సర్‌గా వ్యవహరించి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించారు.
తెలుగు అసోసియేషన్ వైస్ చైర్మన్ సుదర్శన్, ట్రెజరర్ అనంత్ ఆచంట, డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ అస్సోసియేషన్ అఫ్ఫైర్స్ చింతకాయల రాజీవ్, మీడియా డైరెక్టర్ ప్రకాష్ ఇవటూరి, మార్కెటింగ్ డైరెక్టర్ రాజ శేఖర్ గుజ్జు, వర్కింగ్ కమిటీ పక్షాన ఉష, భీం శంకర్ బంగారి, చరణ్, మోహన కృష్ణ తదితరులు సంబురాల నిర్వహణలో తమ వంతు పాత్ర పోషించినట్లుగా నిర్వహకులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
డల్లాస్‌లో సీనియర్ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు పర్యటన
వర్జీనియాలో అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణం
Read Latest NRI News And Telugu News
Updated Date - Oct 08 , 2025 | 06:53 PM