Hanshita Reddy: మేకప్ ఇప్పుడు నిత్యావసరం
ABN, Publish Date - Dec 21 , 2025 | 07:13 AM
హన్షితారెడ్డి.. ఈ పేరు వినగానే ప్రముఖ నిర్మాత దిల్ రాజు తనయగా, నిర్మాతగా మాత్రమే గుర్తొస్తారు. ఇప్పుడామె హైదరాబాద్ బ్యూటీ వరల్డ్‌లోకి అడుగుపెట్టారు...
హన్షితారెడ్డి.. ఈ పేరు వినగానే ప్రముఖ నిర్మాత దిల్ రాజు తనయగా, నిర్మాతగా మాత్రమే గుర్తొస్తారు. ఇప్పుడామె హైదరాబాద్ బ్యూటీ వరల్డ్‌లోకి అడుగుపెట్టారు.
సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ హారికతో కలిసి ప్రీమియం మేకప్ స్టూడియో ‘ది గుడ్ సైడ్’ను ప్రారంభించారు. ‘సౌందర్యం అంటే ముఖాన్ని మార్చేయడం కాదు.. మీలోని అసలైన అందాన్ని వెలికితీయడం’ అని చెప్పే హన్షితారెడ్డితో ‘నవ్య’ ప్రత్యేక ఇంటర్వ్యూ.
ఒక స్టాండ్ ఎలోన్ స్టోర్‌ను ప్రారంభించాలనే ఆలోచన మీకెలా వచ్చింది?
నిజానికి దీనికి చాలామంచి స్కోప్ ఉందని నాకు ముందే తెలుసు. కానీ ఇదంతా ఏదో చిన్నగా కాకుండా భారీస్థాయిలో ఉండాలి. ఇంటీరియర్స్ ఒక ప్రత్యేక శైలిలో ఉండాలి. దేశంలోనే అత్యుత్తమ మేకప్ ఆర్టిస్టులు మనతో కలిసి పనిచేయాలి. ఇలాంటి ఆలోచనల నుంచే ఈ స్టూడియో పుట్టింది.
ప్రస్తుత కాలంలో, ముఖ్యంగా మహిళల రోజువారీ
జీవితంలో మేకప్ ఎంత ముఖ్యమని మీరు
అనుకుంటున్నారు?
మనకందరికీ పుట్టుకతోనే ఒక సహజమైన అందం ఉంటుంది. మేము నమ్మేది కూడా అదే. మా స్టూడియోకి వచ్చే వారికి ‘మేము మీలో కొత్త అందాన్ని సృష్టించలేం. మీలో ఉన్న సహజమైన అందాన్ని మరింత ఎలివేట్ చేస్తాం’’ అని చెబుతుంటాం. ఏదైనా పార్టీకో, ఫంక్షన్‌కో వెళ్లేటప్పుడు మంచి దుస్తులు వేసుకుంటాం. హెయిర్ స్టైల్ చక్కగా చేసుకుంటాం. అలాగే, మేకప్ అనేది ఓ లుక్‌ని సంపూర్ణంగా మార్చే ఒక అద్భుతమైన ఎలిమెంట్. అది మిమ్మల్ని ఫర్‌ఫెక్ట్‌గా చూపిస్తుంది.
ఒకప్పుడు మేకప్ అంటే కేవలం పెళ్లిళ్లకో, వేడుకలకో పరిమితం. కానీ ఇప్పుడిది రోజువారీ అవసరంగా ఎలా మారింది?
అవును! గడిచిన 15 సంవత్సరాల్లో పరిస్థితి పూర్తిగా మారింది. ఒకప్పుడు పెళ్లి సమయంలో మాత్రమే మేకప్ వేయించుకునేవారు. 20-22 ఏళ్ల వరకు మేకప్ జోలికి వెళ్లని వారు కూడా పెళ్లి రోజున మాత్రం కచ్చితంగా వేసుకుంటున్నారు. కానీ పాశ్చాత్య దేశాల్లో ఇది ఎప్పటి నుంచో వారి జీవనశైలిలో భాగం. గత పదేళ్లుగా మన దగ్గర కూడా ట్రెండ్ మారుతోంది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ప్రభావం బాగా పెరిగింది. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా పర్‌ఫెక్ట్‌గా కనిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అందుకే ఇప్పుడు మేకప్ అనేది నిత్యావసరంగా మారిపోయింది.
సాధారణంగా ప్రజలు మేకప్ కోసం ఎంతవరకు ఖర్చు చేయడానికి ఇష్టపడుతున్నారు?
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను బట్టి రేట్లు ఉన్నాయి. సాధారణంగా ఒక పార్టీ మేకప్ కోసం రూ. 7 వేల నుంచి రూ. 10 వేల వరకు ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు. ఇక బ్రైడల్ మేకప్ (పెళ్లికూతురి అలంకరణ) విషయానికి వస్తే ఆకాశమే హద్దు. రూ. 40 వేలు మొదలుకొని రూ. 4 లక్షలు కూడా తీసుకునే ఆర్టిస్టులు ఉన్నారు. ఇదొక పెద్ద ఇండస్ట్రీగా ఎదుగుతోంది.
మార్కెట్లో దొరికే ఉత్పత్తుల వల్ల చర్మం పాడవుతోందనే ప్రచారం ఉంది కదా, మీరేం చెప్తారు?
ఇలాంటి చర్చలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కానీ, సైంటిఫిక్‌గా ఏదైనా ప్రొడక్ట్ హానికరం అని తేలితే ఏ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ దాన్ని వాడరు. మేము నాణ్యత విషయంలో ఎప్పుడూ రాజీపడం.
ఒక మహిళ వ్యక్తిత్వానికి, మేక్‌పకు సంబంధం ఏమిటి?
మేకప్ వల్ల ముఖం మరింత అందంగా కనిపిస్తుందని చెప్పడం కంటే, అది ఒక మహిళలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని నమ్ముతాను.
హైదరాబాద్‌లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదా?
మీ ‘ద గుడ్‌సైడ్’ వాటికంటే ఎలా భిన్నమైనది?
నా పార్ట్‌నర్ హారిక ఈ రంగంలో పదేళ్లుగా ఉన్నారు. ఆమె స్వయంగా గొప్ప మేకప్ ఆర్టిస్ట్. మా దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరికీ ఆమె పర్స్‌నల్‌గా ట్రైనింగ్ ఇస్తారు. క్లయింట్ అవసరాలను బట్టి ‘స్టెప్ బై స్టెప్’ ప్రొసీజర్ ఉంటుంది. కొన్నిసార్లు క్లయింట్ ఒకటి ఊహించుకుంటే, వారి ముఖానికి అది సెట్ కాకపోవచ్చు. అటువంటి సమయంలో హారిక వారికి ఏది బాగుంటుందో పర్సనల్‌గా గైడ్ చేస్తారు.
మన సమాజంలో ‘తెల్లగా ఉండటమే అందం’ అనే భావన ఇంకా ఉందంటారా?
అందుకే మా బ్రాండ్‌కు ‘ద గుడ్ సైడ్’ అని పేరు పెట్టాం. ప్రతి మనిషిలోనూ ఒక ‘గుడ్‌సైడ్’ ఉంటుందని మా నమ్మకం. అది తెలుపు కావచ్చు. నలుపు కావచ్చు. మీ చర్మం రంగు ఏదైనా మిమ్మల్ని మరింత అందంగా చూపించడమే మా పని. రంగుతో సంబంధం లేకుం డా కళ్లు, పెదవుల అలంకరణ ద్వారా అద్భుత లుక్ తీసుకురావచ్చు. ఇప్పుడు జనరేషన్ మారింది. అందరూ అన్ని రకాల స్కిన్ టోన్స్‌ను గౌరవిస్తున్నారు.
సెలబ్రిటీలలో ఎవరి మేకప్ స్టైల్ మీకు నచ్చుతుంది?
ప్రస్తుత తరం హీరోయిన్లలో అనన్యపాండే మేకప్ చాలా బాగుంటుంది. ఇక తెలుగులో రష్మిక మందన్న లుక్స్ నాకు పర్సనల్‌గా ఇష్టం.
మేకప్ అంటే కేవలం పైన పూసే రంగు మాత్రమే కాదని చెబుతున్నారు. మరి స్కిన్‌కేర్ గురించి మీరేమంటారు?
ఒక పెళ్లికూతురు మేక్‌పలో మెరిసిపోవాలంటే దాని వెనుక రెండు నెలల కష్టం ఉంటుంది. మంచి డైట్ తీసుకోవాలి. నీళ్లు బాగా తాగాలి. డెర్మటాలజిస్ట్ సలహాలు పాటించాలి. లోపల ఆరోగ్యం బాగుంటేనే పైన వేసే మేకప్ ఎలివేట్ అవుతుంది. హీరోయిన్లు అంత అందంగా కనిపిస్తున్నారంటే దానికి కారణం వారి లైఫ్ స్టైల్. నీళ్లు లేకపోతే మొక్క ఎలా వాడిపోతుందే స్కిన్ కూడా అంతే! కేవలం మేకప్ వేసేస్తే అందం రాదు. చర్మాన్ని లోపలి నుంచి ఆరోగ్యంగా ఉంచుకోవాలి.
సీవీఎల్‌ఎన్ ప్రసాద్
పురుషుల మేకప్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? వారు కూడా వస్తున్నారా?
కచ్చితంగా! గత కొన్నేళ్లుగా పురుషుల్లోనూ అవగాహన పెరిగింది. ముఖ్యంగా పెళ్లిళ్లలో వధూవరుల ప్యాకేజీ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఫొటోల్లో అమ్మాయిలు మేక్‌పతో చాలా పర్‌ఫెక్ట్‌గా కనిపిస్తారు. వారి పక్కన అబ్బాయిలు డల్‌గా ఉండకూడదు కదా. అందుకే ఇప్పుడు పెళ్లికొడుకులు కూడా హెయిర్ స్టైలింగ్, టచప్స్ కోసం ఆసక్తి చూపిస్తున్నారు.
Also Read:
న్యూ ఇయర్ పార్టీ.. ఇండియాలో బెస్ట్ బీచ్ డెస్టినేషన్స్ ఏవో తెలుసా?
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!
For More Latest News
Updated Date - Dec 21 , 2025 | 07:13 AM