Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్
ABN, Publish Date - May 14 , 2025 | 05:12 PM
Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ దాడిలో లష్కరే తోయిబా చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులతోపాటు అతడి సన్నిహితులు నలుగురు మరణించారు. వీరికి పాక్ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
న్యూఢిల్లీ, మే 14: పాలు తాగుతూ.. తనను ఎవరూ చూడలేదన్నట్లుగా పిల్లి వ్యవహరిస్తుందంటారు. అదే రీతిలో పాకిస్థాన్ తీరు ఉందనే ఒక చర్చ అయితే జరగుతోంది. ఉగ్రవాదానికి పాకిస్థాన్ ఊతం ఇస్తుందన్న సంగతి అందరికి తెలిసిందే. కానీ ఉగ్రవాదం గురించి తమకు ఏం తెలియదంటూ పాకిస్థాన్ ఇప్పటికే నక్క వినయాన్ని ప్రదర్శించింది. ప్రదర్శిస్తోంది కూడా. ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడితో తమకు ఏం ప్రమేయం లేదంటూ ఆ దేశం వెల్లడించింది. ఆ కొద్ది రోజులకే పహల్గాం పాపం తమదేనంటూ పాకిస్థాన్‌లోని అత్యున్నత సైనికాధికారి ప్రకటించారు. దీంతో పహల్గాం దాడి వెనుక పాక్ హస్తం ఉందని రుజువు అయింది.
ఉగ్రవాదానికి పాక్ ఊతం ఇస్తుందనేందుకు తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్.. ఆపరేషన్ సిందూర్ పేరిట దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో జైషే మహమ్మద్ సంస్థ చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులతోపాటు అతడి సన్నిహితులు మొత్తం 14 మంది మరణించారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మృతులు ఒక్కొక్కరికి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో జైషే మహమ్మద్ సంస్థ చీఫ్ మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు ఎక్స్‌గ్రేషియాగా ప్రభుత్వం తరఫున అందనుంది.
మే 7వ తేదీ తెల్లవారుజామున పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 100 మందికిపైగా మరణించినట్లు భారత్ వెల్లడించింది. అయితే ఈ దాడిలో మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రవుఫ్ అజార్‌తోపాటు ఇద్దరు బావలు మరణించారు. అయితే ఈ అబ్దుల్ రవుఫ్ అజార్.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా భారత్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.
1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం హైజాక్ పథక రచనలో ఇతడు కీలక సూత్రదారిగా ఉన్నాడు. అలాగే 2001లో పార్లమెంట్‌పై దాడితోపాటు పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై దాడి కేసులో సైతం అబ్దుల్ రవుఫ్ అజార్ కీలకంగా వ్యవహరించినట్లు భారత్ నిఘా వర్గాల వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయన్న సంగతి అందరికి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్
Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్
Operation Sindoor: భుజ్ ఎయిర్‌బేస్‌కు రాజ్‌నాథ్ సింగ్
Droupadi Murmu: రాష్ట్రపతితో సీడీఎస్, త్రివిధ దళాధిపతుల భేటీ
For National News And Telugu News
Updated Date - May 14 , 2025 | 06:01 PM