Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్
ABN , Publish Date - May 14 , 2025 | 04:24 PM
Donald Trump: యూఎస్ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ప్రాచ్య దేశాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సౌదీ రాజు విలాసవంతమైన విమానాాన్ని బహుమతిగా అందజేశారు. ఈ బహుమతిపై యూఎస్ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
అమెరికా, మే 14: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాలుగు రోజుల పాటు మధ్య ప్రాచ్య దేశాల్లో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా ఖతార్‌లో పర్యటిస్తున్న ఆయనకు సౌదీ రాజు ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ కుటుంబం.. విలాసవంతమైన బోయింగ్ 747-8 జంబో జెట్ విమానాన్ని బహుకరించింది. ఈ బహుమతిని తాను స్వీకరించినట్లు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. బుధవారం తన ఎక్స్ ఖాతా వేదికగా ఆయన స్పందించారు. బోయింగ్ 747 - 8 విమానాన్ని సౌదీ రాజు అమెరికాకు బహుమతిగా ఇచ్చారన్నారు. అంతేకానీ ఈ బహుమతి తనకు ఇచ్చింది కాదని ఆయన స్పష్టం చేశారు.
ఈ విమాన సేవలను యూఎస్ రక్షణ శాఖ వినియోగించు కొంటుందని తెలిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతోన్నాయని ఆయన గుర్తు చేశారు. కొత్త బోయింగ్ విమానం వచ్చే వరకు.. దీనిని తమ ప్రభుత్వం ఎయిర్ ఫోర్స్ వన్‌గా కొనసాగిస్తామని యూఎస్ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అయితే కొంత మంది.. మీరు దేశం కోసం బహుమతులు అంగీకరించకూడదంటున్నారన్నారు. తాము బహుమతిని ఎందుకు అంగీకరించకూడదని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. అయితే తాము అందరికి బహుమతులు అందిస్తున్నామని చెప్పారు. అమెరికా ప్రభుత్వం వద్ద కంటే గల్ఫ్‌లో భారీ విమానాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఆ క్రమంలో తమ వద్ద కూడా భారీ విమానం ఉండాలని భావిస్తున్నానన్నారు.
ఈ విమాన ప్రత్యేకలు..
ఈ విమానంలో అతిపెద్ద బెడ్ రూమ్‌తో పాటు అతిథి కోసం సూట్ ఏర్పాటు చేశారు. రెండు పెద్ద బాత్ రూమ్‌లతోపాటు ఐదు లాంజ్‌లు, ప్రైవేట్ ఆఫీస్, ఐదు వంట గదులు ఉన్నాయి. ఈ విమానంలోని ఇంటిరియర్ డిజైన్ మొత్తాన్ని ఫ్రెంచ్‌కు చెందిన అల్బర్టో పింటో సంస్థ డిజైన్ చేసింది. అసలు అయితే 747 కమర్షల్ విమానం 460 మంది ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తుంది. కానీ బోయింగ్ 747 -8 విమానం మాత్రం 90 మంది వీఐపీలతోపాటు 14 మంది సిబ్బంది ఉండే విధంగా రూపొందించారు. వీటిని బిజినెస్ క్లాస్ తరహాలో తీర్చిదిద్దారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్
Operation Sindoor: భుజ్ ఎయిర్‌బేస్‌కు రాజ్‌నాథ్ సింగ్
Droupadi Murmu: రాష్ట్రపతితో సీడీఎస్, త్రివిధ దళాధిపతుల భేటీ
For National News And Telugu News