Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్
ABN , Publish Date - May 14 , 2025 | 03:27 PM
Teachers in Class Room: విద్యార్థులకు విద్యా బుద్దులు చెప్పాల్సిన టీచర్లే దారి తప్పారు. విద్యార్థుల ముందు ఏం చేయకూడదో .. ఆ హెడ్ మాస్టర్లు అదే చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భావి భారత పౌరులను తీర్చిదిద్దడమే ఉపాధ్యాయుల విధి. అలాంటి ఉపాధ్యాయులు..పైగా హెడ్ మాస్టర్‌గా విధులు నిర్వహిస్తూ.. తరగతి గదిలో మద్యం సేవించారు. అది కూడా విద్యార్థుల ముందు.. మరో హెడ్ మాస్టర్‌తో కలిసి మద్యం సేవించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గ్రామస్తులు సైతం పాఠశాలను పానశాలగా మార్చారంటూ హెడ్మాస్టర్ల తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు హెడ్ మాస్టర్లపై జిల్లా ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ అమ్రోహ్ జిల్లా హసన్‌పూర్ బ్లాక్‌లోని ఫయాజ్ నగర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల చోటు చేసుకుంది. స్థానిక పాఠశాలహెడ్ మాస్టర్ అరవింద్ కుమార్.. సమీపంలోని సుతారి గ్రామంలోని పాఠశాల హెడ్ మాస్టర్ అన్‌పాల్ కలిసి క్లాస్ రూమ్‌లో విద్యార్థుల ముందు మద్యం సేవిస్తున్నారు. ప్రతి రోజు వారు ఇదే రీతిగా వ్యవహరిస్తున్నారు. మద్యం సేవిస్తున్న వీరిద్దరిని గ్రామస్తులు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
అలాగే ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ నిధిగుప్తాకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారంపై ప్రాథమిక దర్యాప్తునకు ఆదేశించారు. దీనిపై బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దర్యాప్తు జరిపి.. ప్రాథమిక నివేదికు జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. దాంతో ఈ ఇద్దరు హెడ్ మాస్టర్లపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా వీరిద్దరిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.
ఇక ఈ వీడియోపై నెటిజన్లు సైతం తమదైన శైలిలో స్పందించారు. హెడ్‌మాస్టర్ల తీరును ఈ సందర్భంగా వారు విమర్శించారు. క్లాస్ రూమ్‌లో.. విద్యార్థుల ముందు.. ఇలా హెడ్‌మాస్టర్లు మద్యం సేవించడం క్షమించరాని నేరమని వారు పేర్కొన్నారు. ఇలాంటి వారిపై ప్రభుత్వం తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Operation Sindoor: భుజ్ ఎయిర్‌బేస్‌కు రాజ్‌నాథ్ సింగ్
Droupadi Murmu: రాష్ట్రపతితో సీడీఎస్, త్రివిధ దళాధిపతుల భేటీ
For National News And Telugu News