Pahalgam Terror Attack: భరత్ భూషణ్ భార్య సుజాతను విచారించిన ఎన్ఐఏ
ABN, Publish Date - Apr 28 , 2025 | 03:31 PM
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన భరత్ భూషణ్ భార్య సుజాతను ఎన్ఐఏ అధికారులు సోమవారం విచారించారు. దాదాపు 8 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది.
బెంగళూరు, ఏప్రిల్ 28: పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో బెంగళూరుకు చెందిన భరత్ భూషణ్ మరణించిన నేపథ్యంలో ఆయన భార్య సుజాతను సోమవారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఉన్నతాధికారులు విచారించారు. ఈ విచారణలో భాగంగా ఆమెను ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు. మీరు కాశ్మీర్ ఎందుకు వెళ్లారు?. ఏ సమయానికి మీరు అక్కడికి చేరుకున్నారు?. ఏ సమయంలో ఉగ్రవాదులు మీరున్న ప్రదేశానికి వచ్చారు?. ఆ సమయంలో భరత్ భూషణ్ ఎక్కడున్నారు?. వాళ్లు మీ వద్దకు వచ్చిన వెంటనే ఏ భాషలో మాట్లాడారు? ఉగ్రవాదుల ముఖాలపై ఏమైనా గుర్తులు లాంటావి ఏమైనా ఉన్నాయా? వాళ్లు ఎలా ఉన్నారు? వాళ్లు ఏ అంశంపైన అయినా మాట్లాడారా? వాటికి మీరు ఏ విధంగానైనా స్పందించారా?. అలాగే వాళ్ల దుస్తులపై సైతం ప్రశ్నలు సంధించారు.
అంతేకాదు ఉగ్రదాడికి పాల్పడిన ఊహచిత్రాలను సైతం భరత్ భూషణ్ భార్య సుజాత ఎదుట ఉంచారు. మరోవైపు.. రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు.. భరత్ భూషణ్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భగా అతడి డెత్ సర్టిఫికేట్, ఆధార్, పాన్ కార్డుతోపాటు బ్యాంక్ అకౌంట్ వివరాలను తీసుకు వెళ్లారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన కర్ణాటక వాసులకు రూ. 10 లక్షల నష్టపరిహారాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఏప్రిల్ 22వ తేదీ జమ్మూ కశ్మీర్‌లోని పెహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది మరణించారు. ఈ ఘటన వెనుక పాకిస్థాన్ ఉందని భారత్ స్పష్టం చేసింది. అందులోభాగంగా పాకిస్థాన్‌పై ఆంక్షలు విధించింది. దీంతో గతంలో పాక్‌తో చేసుకొన్న సింధూనదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. అలాగే భారత్‌లో పర్యటిస్తున్న పాక్ జాతీయులు వెంటనే దేశం విడిచి వెళ్లాలంటూ గడువు సైతం విధించింది. ఇక పాక్ సైతం ఇదే రీతిలో స్పందించింది. దాంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇవి కూడా చదవండి:
Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం
Varanasi: వారణాసిలో కెనడియన్ అరెస్ట్.. ఎందుకంటే..
Hyderabad IT Corridor: బంగ్లాదేశ్ వాసి అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు
Pahalgam Terror Attack: పాకిస్థానీ యూట్యూబ్ చానెల్స్‌ను నిషేధించిన భారత్
Supreme Court: కేంద్ర ప్రభుత్వానికి, ఓటీటీలకు సుప్రీంకోర్టు నోటీసులు.. ఎందుకంటే..
For National News And Telugu News
Updated Date - Apr 28 , 2025 | 03:31 PM