Pahalgam Terror Attack: పాకిస్థానీ యూట్యూబ్ చానెల్స్‌ను నిషేధించిన భారత్
ABN , Publish Date - Apr 28 , 2025 | 10:44 AM
Pahalgam Terror Attack: పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌కు చెందిన పలు యూట్యూబ్ చానెల్స్‌పై నిషేధం విధించింది. కేంద్ర హోం మంత్రిత్వ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థానీ యూట్యూబ్ చానెల్స్‌పై భారత్ నిషేధం విధించింది. మొత్తం 16 యూట్యూబ్ ఛానెల్స్‌పై వేటు వేసింది. ఈ ఉగ్రదాడి అనంతరం సదరు యూట్యూబ్ ఛానెల్స్ మతపరమైన సున్నితమైన అంశాలను రెచ్చగొట్టేలా ఈ చానెల్స్ వ్యాప్తి చేసిన నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ నిషేధం విధించబడిన యూట్యూబ్ ఛానెల్స్‌లో డాన్,సమా టీవీ, ఏఆర్‌వై న్యూస్,బోల్ న్యూస్,రఫ్తార్,జియో న్యూస్‌తోపాటు సునో న్యూస్ తదితర వార్తా సంస్థలకు చెందిన యూట్యూబ్ ఛానెల్‌లు ఉన్నాయని జాబితా విడుదల చేసింది. అలాగే జర్నలిస్టులు ఇర్షాద్ భట్టి,అస్మా షిరాజీ,ఉమర్ చీమాతోపాటు మునీబ్ ఫరూక్‌ల యూట్యూబ్ ఛానెల్‌లు కూడా నిషేధించినట్లు స్పష్టం చేసింది.
ఏప్రిల్ 22వ తేదీ జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు జరిపారు. దీంతో మొత్తం 26 మంది మరణించారు. ఈ ఘటన అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాంతో పాకిస్థాన్ లక్ష్యంగా భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఈ నేపథ్యంలో పాక్ సైతం భారత్‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంది. అలాంటి ఉద్రిక్తల నడుమ మతపరంగా సున్నితమైన అంశాలను పలు యూట్యూబ్ ఛానెల్స్ తమదైన శైలిలో విస్తృత ప్రచారం చేశాయి. అది కూడా భారత్‌కు, ఆ దేశ సైన్యానికి వ్యతిరేకంగా ప్రచారం చేశాయి. దీంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫార్స్ మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇవి కూడా చదవండి:
India Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌కు 4 రోజుల్లో 537 మంది ప్రయాణం
Pakistan Citizens: భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీలకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా
Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్
For National News And Telugu News