Assembly Bypolls: ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం
ABN, Publish Date - Jun 19 , 2025 | 09:15 AM
దేశంలో వివిధ రాష్ట్రాల్లోని పలు అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
న్యూఢిల్లీ, జూన్ 12: దేశంలో వివిధ రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించిన ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. గురువారం ఉదయం 7.00 గంటలకు ఈ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్‌లోని కాళీగంజ్, కేరళలోని నీలాంబుర్, పంజాబ్‌లోని లూథియాన పశ్చిమ, గుజరాత్‌లోని కాడి, విశవదార్ అసెంబ్లీ స్థానాలకు ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
అలాగే పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేసినట్లు వివరించింది. ఈ ఉప ఎన్నికల ఫలితాలు జూన్ 23వ తేదీన వెల్లడికానున్నాయి. మరోవైపు కేరళ, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు ఉప ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపనున్నారనేది ఆసక్తికర అంశంగా మారింది. ఇక ఈ ఉప ఎన్నికల పోలింగ్ ఈ రోజు సాయంత్రం 6.00 గంటల వరకు జరగనుంది. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా ఓటర్లు క్యూ లైన్‌లో నిలబడి ఉంటే.. వారికి సైతం తమ ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించింది.
ఈ వార్తలు కూడ చదవండి..
మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్.. రవి, అరుణ మృతి
ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
For National News And Telugu News
Updated Date - Jun 19 , 2025 | 09:25 AM