Operation Sindoor: మోదీ హయాంలో వాయుసేన రక్షణ, దాడి సామార్ధ్యాల బలోపేతం..
ABN, Publish Date - May 09 , 2025 | 01:21 PM
Operation Sindoor: భారీత్.. పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హయాంలో వాయుసేన రక్షణ, దాడి సామార్ధ్యాలను మరింత బలోపేతం చేశారు. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ శుక్రవారం నోట్ విడుదల చేసింది.
న్యూఢిల్లీ: భారీత్ (India).. పాకిస్తాన్ (Pakistan) యుద్ధం నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (PM Modi) కీలక నిర్ణయం తీసుకున్నారు. వాయుసేన రక్షణ (Air Force Defense), దాడి సామార్ధ్యాలను మరింత బలోపేతం చేశారు. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ (Central Information Broadcasting Department) శుక్రవారం నోట్ విడుదల చేసింది. కాగా ఉగ్రవాదులను బోర్డర్ దాటించేందుకు పాక్ సైన్యం కుటిల ప్రయత్నం చేసింది. గత రాత్రి జమ్మూ కాశ్మీర్‌లోని సాంబ సెక్టార్‌లో భారీ కాల్పులకు తెగబడుతూ... జైషే ఉగ్రముకలను భారత్‌లో ప్రవేశ పెట్టడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది. దీంతో భారత్ భద్రతా బలగాలు పాక్ యత్నాలను సమర్ధవంతంగా తిప్పికొట్టింది. జైషే మహ్మద్ ముష్కరులను మట్టుబెట్టింది.
వాయుసేన బలోపేతంలో ముఖ్యాంశాలు:
* ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత సైన్యం 9 ఉగ్రవాద శిబిరాలను పాకిస్థాన్లో ధ్వంసం చేసింది.
* పాకిస్థాన్ ప్రతిదాడికి ప్రయత్నించినా, భారత్ వాయుసేన అన్ని క్షిపణులను నిలువరించింది. ఒక్కదానిని కూడా లక్ష్యానికి చేరనీయలేదు.
* ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లో భాగంగా S-400, బరాక్-8, ఆకాష్ క్షిపణులు, DRDO యాంటీ-డ్రోన్ టెక్నాలజీలు సమన్వయంతో పనిచేశాయి.
* భారత్ కేవలం రక్షణతోనే ఆగలేదు. ప్రతిదాడిలో లాహోర్లోని చైనా సరఫరా చేసిన HQ-9 యూనిట్‌ను ధ్వంసం చేసింది.
* 2014 తర్వాత మోదీ ప్రభుత్వ హయాంలో, దేశం సమగ్రంగా వాయుసేన సామర్థ్యాలను మెరుగుపరచింది.
Also Read: మిస్ వరల్డ్ 2025 వేడకలు..
ముఖ్యమైన ఆయుధాలు మరియు టెక్నాలజీలు:
* 35,000 కోట్ల విలువైన S-400 ట్రయుమ్ఫ్ డీల్ (2018) – 3 యూనిట్లు ఇప్పటికీ చైనా, పాక్ సరిహద్దుల్లో పనిచేస్తున్నాయి.
* బరాక్-8 క్షిపణులు – ఇజ్రాయెల్‌తో రూ. 20,000 కోట్ల ఒప్పందం (2017).
* ఆకాష్ స్వదేశీ క్షిపణులు, DRDO యాంటీ డ్రోన్ టెక్నాలజీలు.
* 2024లో “మ్యాన్ పోర్టబుల్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్” అమలు.
ఆధునిక యుద్ధంలో భారత టెక్నాలజీ..
* లోయిటరింగ్ మ్యూనిషన్స్ (ఆత్మాహుతి డ్రోన్లు) తొలి సారిగా ఉపయోగించబడ్డాయి.
* ఇజ్రాయెల్ Harop డ్రోన్లు – ఇప్పటి నుంచి భారతదేశంలో తయారవుతున్నవి – లాహోర్, కరాచీ వంటి నగరాల్లో పాకిస్థాన్ డిఫెన్స్ టార్గెట్లపై దాడులు చేశాయి.
* రఫేల్ యుద్ధ విమానాలు SCALP, HAMMER క్షిపణులతో ప్రదర్శించిన దాడి సామర్థ్యం గణనీయమైనది.
* భారత వాయుసేన ఇప్పుడు ఒక టెక్నాలజీ ఆధారిత, బహుళ-స్థాయి రక్షణ వ్యవస్థతో పనిచేస్తోంది.
* “ఆపరేషన్ సిందూర్” ద్వారా భారత్ తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది. ఇప్పుడు భారత్ ఆకాశాన్ని కాపాడడమే కాదు, ఆక్రమించగలదు కూడా.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజలను సయితం విరాళాలు అడుక్కునే పరిస్థితిలో పాక్
పాక్ దాడులపై ఎక్స్‌లో భారత ఆర్మీ పోస్ట్
యుద్ధ వాతావరణం.. సైరన్లు మోగుతున్నాయి...
For More AP News and Telugu News
Updated Date - May 09 , 2025 | 01:21 PM