ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tennis Player Death: గురుగ్రామ్‌లో విషాదం.. టెన్నిస్ క్రీడాకారిణిని కాల్చి చంపిన తండ్రి..

ABN, Publish Date - Jul 10 , 2025 | 06:56 PM

గురుగ్రామ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానిక సుశాంత్ లోక్-ఫేజ్ 2లో నివాసం ఉంటున్న టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్‌ను (25).. ఆమె తండ్రి కాల్చి చంపాడు. రాధిక యాదవ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం అలవాటుగా ఉండేది. ఈ విషయంతో తండ్రీకూతుళ్లకు మధ్యలో గొడవ జరుగుతుండేది..

గురుగ్రామ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానిక సుశాంత్ లోక్-ఫేజ్ 2లో నివాసం ఉంటున్న టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్‌ను (25).. ఆమె తండ్రి కాల్చి చంపాడు. రాధిక యాదవ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం అలవాటుగా ఉండేది. ఈ విషయంతో తండ్రీకూతుళ్లకు మధ్యలో గొడవ జరుగుతుండేది. కూతురు ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆగ్రహించిన తండ్రి.. రాధికను తుపాకీతో కాల్చి చంపినట్లు తెలిసింది. మొత్తం 5 రౌండ్లు కాల్పులు జరపగా.. అందులో మూడు బుల్లెట్లు రాధిక శరీరంలోకి చొచ్చుకెళ్లాయి. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.

గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాధికకు, ఆమె తండ్రికి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన తండ్రి.. కూతురిపై కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రాధిక తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య వెనుక రీల్స్ చేయడమే కారణమా.. లేక వేరే ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా.. అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిణిగా ఉన్న రాధిక.. అనేక పోటీల్లో గెలిచింది.

ఇవి కూడా చదవండి:

ట్రంప్‌పై మండిపడ్డ బ్రెజిల్ అధ్యక్షుడు

భారీ షాకిచ్చిన ట్రంప్.. ఏకంగా 50 శాతం సుంకం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 10 , 2025 | 09:01 PM