Rains: ఏడు రోజులు ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు
ABN, Publish Date - Jun 06 , 2025 | 10:39 AM
రాష్ట్రంలో ఏడు రోజులు ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
చెన్నై: రాష్ట్రంలోని ఒకటి, రెండు ప్రాంతాలు, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో వచ్చే ఏడు రోజులు ఉరుములు, ఈదురుగాలులతో మోస్తరు వర్షం కురిసే అవకాశముంది. ఈ మేరకు ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో... పశ్చిమ గాలుల వేగంలో మార్పుల కారణంగా రాష్ట్రంలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీవర్షాలు, మిగిలిన ప్రాంతంలో మోస్తరు వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. రాజధాని నగరం చెన్నైలో ఆకాశమ మేఘావృతంగా ఉంటూ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ధనుష్కోడి తీరంలో పెనుగాలులు
రామేశ్వరం సమీపం ధనుష్కోడి తీరంలో గత రెండు రోజులుగా వీస్తున్న పెనుగాలులకు అరిచ్చలైమునై మూడు వైపులా రాక్షస అలలు ఎగసిపడ్డాయి. దీంతో అరిచ్చల్‌మునై జాతీయ రహదారిని ఇసుకమేటలు పూర్తిగా కప్పేశాయి. దీంతో గురువారం ఉదయం ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు వెళ్ళిన పర్యాటకులు తీవ్ర నిరాశ చెందారు. ప్రస్తుతం ధనుష్కోడి, ముకుందరాయర్ సత్రం, అరిచ్చల్‌మునై ప్రాంతాల్లో తీరంలో ఉన్న ఇసుక రోడ్డుమీదకు చేరింది.
రామేశ్వరం నుండి ధనుష్కోడి వెళ్లే మార్గంలోనూ రహదారిపై ఇసుకమేటలు పరచుకున్నాయి. దీంతో ఆ మార్గంలో వాహనచోదకులు ఇబ్బందులకు గురయ్యారు. ధనుష్కోడి తీరంలో రాక్షస అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండడంతో పర్యాటకులు అరిచ్చల్‌మునై చివరి ప్రాంతానికి ఎవరూ వెళ్ళకూడదంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ముకుందరాయర్ సత్రం, ధనుష్కోడి, అరిచ్చల్‌మునై సముద్రతీరంలోకి ఎవరూ దిగకూడదని, స్నానాలు చేయొద్దని పోలీసులు మైకుల్లో హెచ్చరికలు చేశారు. ధనుష్కోడిలో సాయంత్రం ఐదు తర్వాత పర్యాటకులెవరూ సంచరించకూడదని కూడా తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు..
బనకచర్లపై ఉత్తమ్, కవిత తప్పుడు ప్రచారం: బక్కని
Read Latest Telangana News and National News
Updated Date - Jun 06 , 2025 | 10:39 AM