India Pak Ceasefire: కశ్మీర్‌లో మళ్లీ మోగనున్న బడిగంట
ABN, Publish Date - May 12 , 2025 | 06:06 PM
సరిహద్దు జిల్లాలైన కుప్వారా, బారాముల్లా, బండిపోరలోని గురెజ్ సబ్-డివిజన్ మినహా కశ్మీర్ అంతటా ఈనెల 13 నుంచి స్కూళ్లు తెరుచుకుంటాయని కశ్మీర్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రకటించారు.
న్యూఢిల్లీ: భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి రావడం, సరిహద్దుల్లో పరిస్థితి సద్దుమణుగుతున్న నేపథ్యంలో కశ్మీర్‌లో మంగళవారం నుంచి మళ్లీ బడులు తెరుచుకోనున్నాయి. సరిహద్దు జిల్లాలైన కుప్వారా, బారాముల్లా, బండిపోరలోని గురెజ్ సబ్-డివిజన్ మినహా కశ్మీర్ అంతటా ఈనెల 13 నుంచి స్కూళ్లు తెరుచుకుంటాయని కశ్మీర్ స్కూల్ ఎడ్యూకేషన్ డైరెక్టర్ ప్రకటించారు. భారత్-పాక్ మధ్య పరసర్ప కాల్పులు నేపథ్యంలో ఇంతకుముందు ఈ బడులను ముందుజాగ్రత్త చర్యగా మూసేశారు.
Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల
కాగా, పంజాబ్‌లోని సంగ్రూర్ సహా ఐదు సరిహద్దు జిల్లాల్లో సోమవారంనాడు కూడా బడులు మూసే ఉంచారు. తక్కిన ప్రాంతాల్లో మాత్రం విద్యాసంస్థలు తిరిగి తెరుచుకున్నాయి. పాకిస్థాన్‌తో సరహద్దులు పంచుకుంటున్న పఠాన్‌కోఠ్, అమృత్‌సర్, ఫిరోజ్‌పూర్, గురుదాస్‌పూర్, తరన్ తరన్ జిల్లాల్లో స్కూళ్లు మూసే ఉంటారు. పాకిస్తాన్‌తో పంజాబ్‌కు 553 కిలోమీటర్ల సరిహద్దు ఉంది.
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు 26 మంది టూరిస్టులను అత్యంత కిరాతకంగా కాల్చిచంపడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇందుకు ప్రతిగా 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాక్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేయడం, 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో యుద్ధ పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో ఇరుదేశాలు కాల్పుల విరమణకు మే 10న అంగీకరించడంతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల
Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ముగియలేదు.. పాకిస్తాన్‌కు వార్నింగ్..
Updated Date - May 12 , 2025 | 06:11 PM