ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Road Accident: రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

ABN, Publish Date - May 25 , 2025 | 11:41 AM

రోడ్డు దాటుతోన్న ఒక కుటుంబాన్ని వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

చెన్నై, మే 25: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న ఆరుగురు వ్యక్తులను వేగంగా దూసుకు వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం ఉదయం మధురై జిల్లాలోని కుంజుంపట్టి సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.


అందులోభాగంగా క్షతగాత్రులను మధురై జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇక మృతదేహాలను సైతం పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ముధురై జిల్లా ఎస్పీ అరవింద్ వెల్లడించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని ఆయన వివరించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేశామన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

పార్టీ కోసమే పని చేస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన శశిథరూర్

భారీ వర్షాలు.. విమాన ప్రయాణికులకు కీలక సూచన..

For National News And Telugu News

Updated Date - May 25 , 2025 | 11:42 AM