ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Heavy Rains: రెండు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

ABN, Publish Date - Jun 14 , 2025 | 12:07 PM

కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. దీంతో నీలగిరి, కోయంబత్తూరు జిల్లాలకు జాతీయ విపత్తుల బృందం, రాష్ట్ర విపత్తుల నిర్వహణ బృందం ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు.

చెన్నై: కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. దీంతో నీలగిరి, కోయంబత్తూరు జిల్లాలకు జాతీయ విపత్తుల బృందం, రాష్ట్ర విపత్తుల నిర్వహణ బృందం ముందు జాగ్రత్త చర్యలు ప్రారంబించారు. వీరంతా నీలగిరి(Neelagiri) జిల్లాలో భారీ వర్షాల కారణంగా నష్టపోయే అవకాశాలున్న 253 ప్రాంతాల్లో నిఘా వేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కారణంగా శని, ఆదివారాల్లో కోవై, నీలగిరి జిల్లాల్లో ఉరుములు మెరుపులు, పెనుగాలులతో కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు హెచ్చరించారు.

దీంతో రెండు జిల్లాల అధికారులంతా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేక రక్షణ బృందం ఏర్పాటైంది. బాధితులను సకాలంలో ఆదుకునేలా 1077 నెంబర్‌తో హెల్ప్‌లైన్‌ కూడా ఏర్పాటు చేశారు. బాధితుల కోసం 430 సహాయక శిబిరాలు కూడా సిద్ధం చేశారు. పోలీసు, అగ్నిమాపక శాఖ, రహదారుల శాఖ, విద్యుత్‌ శాఖ, ప్రజాపనుల శాఖ అధికారులు, సిబ్బంది వర్షబాధిత ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టేందుకు 24 గంటలపాటు సిద్ధంగా ఉండాలని జిల్లా అధికారులు పేర్కొన్నారు. పెనుగాలులకు చెట్లు కూలిపడితే వాటిని తొలగించేందుకు అవసరమైన సామగ్రి కూడా సిద్ధం చేయాలని అగ్నిమాపక దళం, కార్పొరేషన్‌, మున్సిపల్‌ అధికారులు కూడా ఆదేశాలిచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం మళ్లీ లక్ష

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన బాలకృష్ణ

Read Latest Telangana News and National News

Updated Date - Jun 14 , 2025 | 12:31 PM