Rajasthan Mother Incident: కన్న కొడుకు ముందే తల్లి దారుణం.. ఎంతకు తెగించిందంటే..
ABN, Publish Date - Jun 18 , 2025 | 01:00 PM
తొమ్మిదేళ్ల కొడుకు ముందే ఒక తల్లి దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను అతి దారుణంగా హత్య చేయించింది. ఎంతకు తెగించిందంటే..
Rajasthan Mother Incident: తొమ్మిదేళ్ల కొడుకు ముందే ఒక తల్లి దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను అతి దారుణంగా హత్య చేయించింది. ఎంతకు తెగించిందంటే.. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి కడతేర్చింది. ఈ దారుణమైన ఘటన రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా ఖేర్లీ ప్రాంతంలో ఈ నెల 7న అర్ధరాత్రి చోటుచేసుకుంది. అయితే, ఈ కేసులో తొమ్మిదేళ్ల చిన్నారి బాలుడు కీలక సాక్షిగా మారాడు. వీరూ అలియాస్ మాన్ సింగ్ జాతవ్ అనే వ్యక్తి తన ఇంట్లోనే అనుమానాస్పదంగా మృతిచెందాడు. అనారోగ్యం కారణంగానే తన భర్త అకస్మాత్తుగా మరణించాడని భార్య అనిత అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, చనిపోయిన మాన్ సింగ్ కుమారుడు పోలీసులకు అసలు విషయాలు చెప్పడంతో కేవలం 48 గంటల్లోనే ఈ హత్య వెనుక ఉన్న నిజాలు బయటపడ్డాయి. అసలేం జరిగిందంటే..
బాలుడి కళ్లెదుటే తల్లి దారుణం
తొమ్మిదేళ్ల చిన్నారి బాలుడు చెప్పిన వివరాల ప్రకారం.. ఈ నెల 7వ తేదీన రాత్రి మా నాన్న మాన్ సింగ్ మంచంపై నిద్రపోతున్నాడు. నేను అప్పుడే నిద్రపోతున్నాను. అయితే, ఇంతలో తలుపు వద్ద ఏదో శబ్దం వినిపించింది. కళ్లు తెరిచి చూస్తే ఆ సమయంలో మా అమ్మ అనిత తలుపు తీస్తోంది. బయట చూస్తే కాశీ అంకుల్ ఉన్నాడు. అయితే, అతడితో పాటు మరో నలుగురు వ్యక్తులు కూడా వచ్చారు. నాకు బాగా భయమేసింది.. నేను లేవలేకపోయాను.. సైలెంట్‌గా ఉంటూ ఏం జరుగుతుందో గమనించాను. అయితే, వాళ్లు మా గదిలోకి వచ్చారు. అమ్మ ఏమో నాన్న పడుకున్న మంచం ముందు నిలుబడి ఉంది. ఆ వ్యక్తులు నాన్నను గట్టిగా గుద్దారు, కాళ్లు విరిచారు, గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశారు. ఇక నేను వెంటనే నాన్న దగ్గరకు వెళ్తుంటే.. కాశీ అంకుల్ నన్ను బెదిరించాడు.. తర్వాత నాన్న ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఇక భయంతో నేను సైలెంట్‌గా ఉండిపోయాను. ఆ తర్వాత అందరూ ఇంట్లో నుండి వెళ్లిపోయారు అని ఆ బాలుడు పోలీసులకు చెప్పాడు.
వివాహేతర సంబంధం
పోలీసుల ప్రకారం.. భార్య అనిత, కాశీ అనే వ్యక్తి ప్లాన్ ప్రకారమే మాన్ సింగ్‌ను చంపారు. ఎందుకంటే, వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉంది. అనిత ఒక చిన్న కిరాణా షాపు నడుపుతుండగా, స్థానికంగా ఉన్న కాశీ తరచూ ఆ దుకాణానికి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇందుకు భర్త అడ్డుగా ఉన్నాడని, అతడిని చంపడానికి అనిత, కాశీ నలుగురు కిరాయి హంతకులకు రూ. 2 లక్షలు సుపారీ ఇచ్చినట్టు తేలింది. చిన్నారి బాలుడు కీలక సాక్షిగా ఉండటంతో అనిత, కాశీ సహా నలుగురు కిరాయి హంతకులు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు.
Also Read:
ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్ .. కేవలం రూ. 3వేల రీచార్జ్‌తో ..
హడావుడే.. తొక్కిసలాటకు కారణం.. ఆ ముగ్గురూ రాజీనామా చేయాలి
For More National News
Updated Date - Jun 18 , 2025 | 02:14 PM