Fastag: ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్ .. కేవలం రూ. 3వేల రీచార్జ్‌తో ..
ABN , Publish Date - Jun 18 , 2025 | 01:16 PM
పాస్టాగ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏడాదికి రూ. 3వేలు రీచార్జ్‌తో దేశంలో ఎక్కడైనా తిరిగే అవకాశం కల్పిస్తోంది.
Fastag: ఫాస్టాగ్ యూజర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం రూ. 3వేలు రీచార్జ్‌తో ఫాస్టాగ్ వార్షిక పాస్ అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఈ పాస్ తీసుకుంటే 200 ట్రిప్పుల వరకు ప్రయాణించే అవకాశం ఉన్నట్లు ఈ మేరకు కేంద్ర మంత్రి గడ్కరీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఏడాదికి రూ. 3వేలు రీచార్జ్ చేసుకుని దేశంలో ఎక్కడైనా తిరిగే అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
ఆగష్టు 15 నుంచి ఈ విధానాన్ని అమలులోకి తీసుకువస్తున్నట్లు గడ్కరీ ప్రకటించారు. ఇక ఈ పాస్ దేశవ్యాప్తంగా ఏ రహదారిపైన ప్రయాణించినా చెల్లుబాటు అవుతుంది. దేశంలో జాతీయ రహదారులపై నిర్బంధ రహిత ప్రయాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని, ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ను ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. వాణిజ్యేతర, వ్యక్తిగత వాహనాలకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఎక్స్ లో పేర్కొన్నారు.
ఫాస్ట్‌ట్యాగ్ అనేది ఒక చిన్న ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) సాంకేతికతను ఉపయోగించి వాహనాల టోల్ రుసుములను ఆటోమేటిక్‌గా చెల్లించడానికి వీలు కల్పిస్తుంది. దీనిని వాహనం విండ్‌స్క్రీన్‌పై అటాచ్ చేసుకుంటారు. టోల్ ప్లాజాల వద్ద ఎక్కువ సేపు ఆగకుండా టోల్ చెల్లించడానికి అనుమతిస్తుంది. అయితే, ఈ ఇయర్ పాస్‌తో టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయం తగ్గిపోతుంది. దీంతో ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
Also Read:
హడావుడే.. తొక్కిసలాటకు కారణం.. ఆ ముగ్గురూ రాజీనామా చేయాలి
రామేశ్వరంలో.. ఆలయ ముట్టడికి భక్తుల యత్నం
For More National News