ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ISI Spy: పాక్ ఐఎస్ఐ‌కు స్పైగా వ్యవహరిస్తోన్న మరో వ్యక్తి అరెస్ట్

ABN, Publish Date - May 29 , 2025 | 01:49 PM

పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ భారత్‌లో చేస్తున్న గూఢచర్యం తవ్వేకొద్దీ బయటకొస్తోంది. భారత్‌లో వినాశకర వాతావరణం సృష్టించడమే లక్ష్యంగా భారత పౌరులనే టార్గెట్ చేసుకుని పెద్ద నెట్ వర్క్ నడుపుతోందీ సంస్థ.

ISI spy

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ భారత్‌లో చేస్తున్న గూఢచర్యం తవ్వేకొద్దీ బయటకొస్తోంది. భారత్‌లో వినాశకర వాతావరణం సృష్టించడమే లక్ష్యంగా భారత పౌరులనే టార్గెట్ చేసుకుని పెద్ద నెట్ వర్క్ నడుపుతోందీ సంస్థ. భారత పౌరులకు రకరకాల ఆశలు చూపి తన దారిలోకి తెచ్చుకుని భారత రహస్యాలు చేజిక్కించుకుంటోంది. ఇటీవల కాలంలో ఇలా పాక్ వలలో చిక్కుకున్న వాళ్లు చాలా మందే బయటకొస్తున్నారు. తాజాగా రాజస్థాన్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి పాకిస్థాన్ కోసం స్పై కార్యకలాపాలు చేసినట్టు తెలుస్తోంది.

రాజస్థాన్ స్టేట్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీస్‌లో పనిచేసే సకూర్‌ ఖాన్‌ మగళియార్‌ను సీఐడీ, ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను గత రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రికి పర్సనల్ సెక్రటరీగానూ వ్యవహరించినట్టు సమాచారం. అయితే, దర్యాప్తు వర్గాలు మాత్రం రాజకీయ లింక్‌లపై ఎలాంటి వ్యాఖ్యలు ఇప్పటివరకూ చేయలేదు. పాక్‌ సరిహద్దుల్లోని జైసల్మేర్‌ జిల్లా బరోడా గ్రామం ఇతడి స్వస్థలం. సదరు మాజీ మంత్రిదీ ఇదే గ్రామం.

కాగా, సకూర్‌ఖాన్‌ వ్యవహారాలపై అనుమానం వచ్చిన దర్యాప్తు సంస్థలు గత కొన్ని వారాలుగా నిఘా పెట్టాయి. ఖాన్‌ మొబైల్‌లో పలు పాకిస్థానీ ఫోన్ నంబర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పాక్‌ను దాదాపు ఏడుసార్లు సందర్శించినట్లు అతడు ఒప్పుకున్నాడు. ఇప్పటివరకు అతడి ఫోన్‌లో ఎటువంటి మిలిటరీ సమాచారం లేదని అధికారులు చెప్పారు. అయితే, అతను కొన్ని ఫైల్స్‌ను డిలీట్‌ చేసినట్లు గుర్తించారు. ఇక ఖాన్‌కు ఉన్న రెండు బ్యాంకు ఖాతాలను విశ్లేషిస్తున్నారు.


ఇవీ చదవండి:

జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్‌కు షాక్

పార్టీ మహిళా కార్యకర్తతో బీజేపీ సీనియర్ నేత అసభ్య ప్రవర్తన

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 29 , 2025 | 03:02 PM