Share News

Jyothi Malhotra: జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్‌కు షాక్

ABN , Publish Date - May 26 , 2025 | 01:59 PM

పాక్‌లో పర్యటించిన సమయంలో జ్యోతి మల్హోత్రాకు ఏకే-47లు పట్టుకున్న గన్‌మెన్‌లు సెక్యూరిటీగా ఉండటం చూసి ఓ యూట్యూబర్ షాకైపోయాడు. ఆమె తీరు చూసి ఆశ్చర్యపోయానని వీడియోలో చెప్పుకొచ్చారు.

Jyothi Malhotra: జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్‌కు షాక్
Jyoti Malhotra Pakistan trip

ఇంటర్నెట్ డెస్క్: పాక్‌కు గూఢచారిగా మారిన భారతీయ యువతి జ్యోతి మల్హోత్రా గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. పాక్ పర్యటన సందర్భంగా ఆమెకు ఏకే-47లు పట్టుకున్న గన్‌మెన్‌లు సెక్యూరిటీగా ఉండటం చూసి ఓ స్కాటిష్ యూట్యూబర్ షాకైపోయారు. ఆమె రేంజ్‌ను చూసి ఆశ్చర్యపోతూ క్యాలమ్ మిల్ అనే యూట్యూబర్ వీడియో పెట్టారు.

మార్చిలో క్యాలమ్ పాక్ సందర్శించిన సమయంలో అక్కడ జ్యోతి మల్హోత్రా చేస్తున్న హల్‌చల్ చూసి షాకైపోయారు. జ్యోతి చుట్టూ ఏకే-47 తుపాకీలు పట్టుకున్న గన్‌మెన్‌లు పహారాగా ఉన్నారని క్యాలమ్ చెప్పుకొచ్చారు. తను వీడియో రికార్డు చేసుకుంటున్న సమయంలోనే జ్యోతి కూడా వీడియో రికార్డు చేస్తూ తన కంట పడిందని అన్నారు. ‘నన్ను నేను ఇంట్రోడ్యూస్ చేసుకున్నా. ఆమె తన పేరు జ్యోతి అని, భారతీయురాలినని చెప్పుకొచ్చింది. పాక్‌కు రావడం కొత్తా అని నన్ను అడిగింది. కాదు.. ఐదోసారి అని బదులిచ్చా’


‘పాక్ ఆతిథ్యం ఎలా ఉందని నన్ను ఆమె అడిగింది. బాగుందని చెప్పా. అప్పుడు ఆమె వెంట ఉన్న గన్‌మెన్‌లను చూసి ఒకింత ఆశ్చర్యపోయా. అంత సెక్యూరిటీ ఆమెకు ఎందుకో నాకు అర్థం కాలేదు. అసలు అంతటి శక్తిమంతమైన తుపాకీల అవసరం ఏముంది? ఆమె చుట్టూ ఆరుగురు గన్‌మెన్‌లు ఉన్నారు. వాళ్లకు యూనిఫాం లేదు. సాధారణ దుస్తుల్లో ఉన్న భద్రతా సిబ్బంది అని అనిపించింది’ అని క్యాలమ్ చెప్పుకొచ్చారు. ఆమెకు పాక్‌లో లభించిన ఆతిథ్యం చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు.


పాక్ పర్యటనలో ఉండగా జ్యోతి మల్హోత్రా పలు హై ప్రొఫైల్ పార్టీల్లో పాల్గొన్నట్టు వెలుగులోకి వచ్చింది. భారత్‌కు తిరిగొచ్చాక కూడా ఆమె అక్కడి వారితో టచ్‌లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, ఆధారాల కోసం ఆమె డిజిటల్ డివైజ్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

జ్యోతి మల్హోత్రా ఆదాయ వ్యయాలపై కూడా దృష్టి సారించారు. నిత్యం విమానాల్లో ఫస్ట్ క్లాస్ తరగతిలో ప్రయాణించేదని గుర్తించారు. ఆదాయానికి మించిన లైఫ్‌స్టైల్ అనుభవించేదని అన్నారు. అసలు పాక్ ప్రాయోజిత టూర్‌లో భాగంగానే ఆమె అక్కడికి వెళ్లి ఉంటుందని అనుమానిస్తున్నారు. చైనాలోనూ పర్యటించిన ఆమె అక్కడ లగ్జరీ కార్లలో ట్రావెల్ చేయడం, ఖరీదైన నగలు కొనుగోలు చేయడాన్ని భద్రతా దళాలు గుర్తించాయి.

Updated Date - May 26 , 2025 | 02:49 PM