ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rahul Gandhi: ఎన్నికల కమిషన్‌పై రాహుల్ బాంబు..?

ABN, Publish Date - Aug 07 , 2025 | 11:55 AM

ఎన్నికల కమిషన్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బాంబ్ పేల్చనున్నారు. ఎన్నికల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలను బయటపెడతానంటూ ప్రకటించిన ఆయన ఇవాళ ఏం చేయబోతున్నారు..? మధ్యాహ్నం ప్రెస్‌మీట్‌లో

Rahul Gandhi statement

న్యూఢిల్లీ, ఆగస్టు 07: ఎన్నికల కమిషన్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బాంబ్ పేల్చనున్నారు. ఎన్నికల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలను బయటపెడతానంటూ ప్రకటించిన ఆయన ఇవాళ ఏం చేయబోతున్నారు..? మధ్యాహ్నం ప్రెస్‌మీట్‌లో సంచలన విషయాలు వెల్లడించనున్నారా..? దేశ వ్యాప్తంగా ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవల మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ.. గత లోక్‌సభ ఎన్నికల్లో 100 నియోజకవర్గాల్లో రిగ్గింగ్ జరిగిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు.. అణుబాంబు లాంటి ఆధారాలను భయటపెడతానంటూ రాహుల్ గాంధీ ప్రకటించారు.

ఆ క్రమంలోనే రెండ్రోజుల క్రితమే విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారాయన. అయితే, శిబుసోరేన్ మృతితో విలేకరుల సమావేశాన్ని వాయిదా వేశారు. ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటు రాహుల్ గాంధీ ప్రత్యేక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 100 లోక్‌సభ స్థానాల్లో రిగ్గింగ్‌‌కు సంబంధించిన ఆధారాలను రాహుల్ గాంధీ బయటపెడతారనే ప్రచారం జరుగుతోంది. మరి రాహుల్ గాంధీ ఏం చెప్పబోతున్నారనే దానిపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Also Read:

వారి బెదిరింపులకు భయపడేది లేదు: వెంకయ్య నాయుడు

ధ్రువ్ జురెల్ ఉంటే గెలుపు ఖాయమా?

For More National News and Telugu News..

Updated Date - Aug 07 , 2025 | 11:55 AM