PMK: అసెంబ్లీ ఎన్నికల్లో నా అనుచరులకే టికెట్లు..
ABN, Publish Date - Jun 26 , 2025 | 12:09 PM
వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో దశాబ్దాలుగా తన వెంటే ఉన్నవారికి మాత్రమే పార్టీ టిక్కెట్ ఇస్తానని పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్ ప్రకటించారు.
- ఈసారి వెరైటీ కూటమి ఏర్పాటు చేస్తా
- పీఎంకే నేత డాక్టర్ రాందాస్
చెన్నై: వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో దశాబ్దాలుగా తన వెంటే ఉన్నవారికి మాత్రమే పార్టీ టిక్కెట్ ఇస్తానని పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్(Dr Ramdas) ప్రకటించారు. గత ఆరు నెలలుగా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ అన్బుమణి, వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. పార్టీపై పట్టు సాధించేందుకు ఇద్దరూ పావులు కదుపుతూనే ఉన్నారు. అన్బుమణి వంద మంది జిల్లా కార్యదర్శులతో కలిసి పోటీ సమావేశాలు జరుపుతున్నారు. అదే సమయంలో ఆయన తండ్రి, పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్ కూడా తైలాపురం గార్డెన్‌లో తన మద్దతుదారులతో తరచూ సమావేశమవుతున్నారు.
అన్బుమణి వెంట ఉన్న జిల్లా కార్యదర్శులను వరుసగా తొలగిస్తూ కొత్తగా జిల్లా శాఖలకు నాయకులను నియమిస్తున్నారు. ఆ మేరకు 61 జిల్లాలకు కొత్త అధ్యక్షులు, 78 మంది జిల్లా కార్యదర్శులను నియమించారు. ఈ నేపథ్యంలో దిండివనం తైలాపురం గార్డెన్‌లో కొత్త జిల్లా నేతలు, జిల్లా కార్యదర్శుల సమావేశం బుధవారం ఉదయం నిర్వహించారు. ఆ సమావేశంలో పార్టీకి కొత్తగా నియమితులైన ప్రధాన కార్యదర్శి మురళి శంకర్, సామాజిక న్యాయవిభాగం నేత గోపు, కోశాధికారి సయ్యద్ మన్సూర్ హుసేన్‌ను జిల్లా నేతలు, కార్యదర్శులకు పరిచయం చేశారు.
ఈ సందర్భంగా రాందాస్ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనను వెన్నంటి ఉన్నవారికే పోటీ చేసే అవకాశం కల్పిస్తానని చెప్పారు. పార్టీలో ఇప్పటికీ తానే సర్వాధికారాలను కలిగి ఉన్నానని తెలిపారు. ఎన్నికల పొత్తుపై ఇప్పటికప్పుడు మాట్లాడటం భావ్యం కాదని, అదే సమయంలో ఈసారీ వైవిధ్యమైన మెగా కూటమి ఏర్పాటవుతుందని,
ఆ కూటమి ఘనవిజయం సాధిస్తుందని చెప్పారు. తన అధ్యక్షతన జరిగిన సమావేశాలకు హాజరయ్యే జిల్లా నేతలు, ఇన్‌ఛార్జులకు మాత్రమే ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇస్తామని స్పష్టంచేశారు.. అన్ని సమస్యలకు ఓ పరిష్కార మార్గం తప్పకుండా ఉం టుందని,ఆ విధంగానే ప్రస్తు తం పార్టీలో నెలకొన్న సమస్యలు కూడా త్వరలో పరిష్కారమవుతాయన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
వావ్.. మళ్లీ తగ్గిన తగ్గిన బంగారం, వెండి ధరలు
ఆరోగ్యశ్రీ మాటున మోసం చేస్తే కఠిన చర్యలు
Read Latest Telangana News and National News
Updated Date - Jun 26 , 2025 | 12:09 PM