PM Modi: మోదీ సర్‌ప్రైజ్... ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో జవాన్లను కలిసిన ప్రధాని..
ABN, Publish Date - May 13 , 2025 | 02:43 PM
ప్రధాని అకస్మాత్తుగా తమ ఎయిర్‌బేస్‌కు రావడంతో జవాన్లలో ఉత్సాహం తొణికిసలాడింది. 'ఆపరేషన్ సిందూర్'లో వాయిసేన సిబ్బంది కీలక పాత్ర పోషించింది.
జలంధర్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) మంగళవారం నాడు పంజాబ్‌లోని జలంధర్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదంపూర్ (Adampur) ఎయిర్‌బేస్‌ను సందర్శించారు. అక్కడి జవాన్లతో మమేకమయ్యారు. ప్రధాని అకస్మాత్తుగా తమ ఎయిర్‌బేస్‌కు రావడంతో జవాన్లలో ఉత్సాహం తొణికిసలాడింది. 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor)లో వాయిసేన సిబ్బంది కీలక పాత్ర పోషించింది. జవాన్లను కలుసుకోవడంపై ప్రధాని తన 'ఎక్స్' ఖాతాలో సంతోషం వ్యక్తం చేశారు.
Operation Sindoor: పాకిస్తాన్‌పై ద్వైపాక్షిక ఒత్తిడికి సిద్ధమైన కేంద్రం
''ఈరోజు ఉదయం ఆదంపూర్‌లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు వెళ్లి మన సాహస యుద్ధవీరులు, జవాన్లను కలుసుకున్నారు. ధైర్యం, దృఢ సంకల్పం, నిర్భీతికి ప్రతీకైన సైనికులను కలుసుకోవడం ప్రత్యేక అనుభూతినిచ్చింది. దేశం కోసం దేనికైనా సిద్ధమయ్యే వీర జవాన్లు మనకు గర్వకారణం'' అని ఆ పోస్టులో మోదీ పేర్కొన్నారు.
50 నిమిషాలు మాతో ఉన్నారు
మోదీ తమ ఎయిర్‌బేస్‌కు రావడంపై సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఉదయం 6:15 గంటలకు ఆదంపూర్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని తమ ఎయిర్‌బేస్‌కు వచ్చి సుమారు 50 నిమిషాలు తమతో ఉన్నారని, వాయుసేన సిబ్బంది, సీనియర్ అధికారులను కలుసుకుని ఆపరేషన్ సిందూర్ గురించి సమాచారం అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌పై జాతినుద్దేశించి సోమవారం రాత్రి ప్రసంగించిన మోదీ ఆ కొద్ది గంటలతో జవాన్లను కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అత్యంత గోప్యంగా..
కాగా, మోదీ పర్యటన ''అత్యంత గోప్యం''గా ఉంచినట్టు జలంధర్ డిప్యూటీ కమిషనర్ హిమన్షు అగర్వాల్ తెలిపారు. జిల్లా పౌర, పోలీసు అధికార యంత్రాగానికి కూడా ఆయన పర్యటన గురించి తెలియదని చెప్పారు. మరోవైపు, ప్రధాని ఆదంపూర్ పర్యటనకు సంబంధించిన 13 సెకన్లు వీడియోను పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. ''మన సాయుధ బలగాల ధైర్యసాహసాలు, కమిట్‌మెంట్‌కు సెల్యూట్ చేస్తున్నాను. మీ వల్లే ఇండియా ఇంత బలంగా ఉంది'' అని ఆ ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Terrorists Trapped: జుమ్మూలో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాదుల హతం
Operation Sindoor: అణువణువూ జల్లెడ పడుతున్న భారత్.. ఆచూకీ చెబితే 20 లక్షలు
Updated Date - May 13 , 2025 | 03:43 PM