PM Modi: రూ.11,000 కోట్లతో హైవే ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ
ABN, Publish Date - Aug 16 , 2025 | 05:13 PM
ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ఢిల్లీ సెక్షన్, అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-II (UER-II) ప్రాజెక్టులు ప్రభుత్వ సమగ్ర ప్లాన్‌లో భాగంగా ప్రారంభమవుతున్నాయి. దేశరాజధానిలో మెరుగైన అనుసంధానం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో రద్దీని తగ్గించడం ఈ ప్రాజెక్టుల ముఖ్యోద్దేశం.
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో రెండు కీలకమైన నేషనల్ హైవే ప్రాజెక్టు (National Highway Projects)లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆదివారంనాడు ప్రారంభించనున్నారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో మెరుగైన కనెక్టివిటీ, రోడ్లపై రద్దీని తగ్గించేందుకు ఈ కీలక ప్రాజెక్టులను ఉద్దేశించారు. సుమారు రూ.11,000 కోట్ల విలువైన ఈ రెండు ప్రాజెక్టులను రోహిణిలో సుమారు 12.30 గంటలకు ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడి వేదక నుంచి ప్రసంగిస్తారు.
ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ఢిల్లీ సెక్షన్, అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-II (UER-II) ప్రాజెక్టులు ప్రభుత్వ సమగ్ర ప్లాన్‌లో భాగంగా ప్రారంభమవుతున్నాయి. దేశరాజధానిలో మెరుగైన అనుసంధానం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో రద్దీని తగ్గించడం ఈ ప్రాజెక్టుల ముఖ్యోద్దేశం. 10.1 కిలోమీటర్ల పొడవైన ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ఢిల్లీ సెక్షన్ రూ.5,360 కోట్లతో డవలప్ చేయనున్నారు. ఈ సెక్షన్‌తో యశోభూమి, బ్లూ లైన్, ఆరెంజ్ లైన్, బిజ్‌వాసన్ రైల్వే స్టేషన్, ద్వారక క్లస్టర్ బస్ డిపోలకు కనెక్టివిటీ ఉంటుంది.
కాగా, 10 కిలోమీటర్ల స్ట్రెచ్‌లో 5.9 కిలోమీటర్లు శివ మూర్తి ఇంటర్‌సెక్షన్ నుంచి ద్వారకా సెక్టార్-21కు అనుసంధానమవుతుంది. 4.2 కిలోమీటర్ల స్ట్రెచ్ ద్వారకా సెక్టార్-21 నుంచి ఢిల్లీ-హర్యానా బోర్డర్ వరకూ అనుసంధానమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 19 కిలోమీటర్ల పొడవైన ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే హర్యానా సెక్షన్‌ను 2024 మార్చిలో ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి..
పద్మశ్రీ బులా చౌదరి గోల్డ్‌మెడల్స్ ఎత్తుకెళ్లిన దొంగలు
ఓట్ చోరీ ప్రచారం.. స్పూఫ్ వీడియో షేర్ చేసిన రాహుల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 16 , 2025 | 05:21 PM