ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: మోదీ సభకు అట్టహాసంగా ఏర్పాట్లు

ABN, Publish Date - Jul 22 , 2025 | 11:07 AM

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను పురస్కరించుకుని గంగైకొండచోళపురంలో భారీ ఏర్పాట్లు చేపడుతున్నారు. సుమారు పదివేల మంది కూర్చునేలా భారీ పందిరి నిర్మిస్తున్నారు. అదే విధంగా విశాలమైన వేదిక కూడా వేస్తున్నారు.

- ముస్తాబవుతున్న గంగైకొండచోళపురం

- పరిశీలించిన మంత్రి శివశంకర్‌

చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) పర్యటనను పురస్కరించుకుని గంగైకొండచోళపురంలో భారీ ఏర్పాట్లు చేపడుతున్నారు. సుమారు పదివేల మంది కూర్చునేలా భారీ పందిరి నిర్మిస్తున్నారు. అదే విధంగా విశాలమైన వేదిక కూడా వేస్తున్నారు. అరియలూరు జిల్లా గంగైకొండచోళపురంలో రాజేంద్రచోళుడి జయంతి వేడుకలు, బృహదీశ్వరాలయ శంకుస్థాపన సహస్రాబ్ది వేడుకలు, రాజేంద్ర చోళుడు ఆగ్నేయ ఆసియా దేశాలపై జరిపిన దండయాత్ర సహస్రాబ్ది ఉత్సవాలు ఇలా ‘ముప్పెరుం విళా’ (త్రివిధ వేడుకల)లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఈ నెల 27న గంగైకొండచోళపురానికి రానున్నారు. ఈ వేడుకలో రాజేంద్రచోళుడి స్మారక నాణేన్ని విడుదల చేయనున్నారు. అదే విధంగా ఆ ప్రాంతంలో పురావస్తు పరిశోధన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ఫొటో ప్రదర్శన ప్రారంభిస్తారు.

తిరువాసగంపై ఇళయరాజా సింఫనీ...

ఆ తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ‘తిరువాసగం సింఫనీ’ (ప్రత్యేక సంగీత విభావరి) నిర్వహించనున్నారు. సుమారు అరగంటసేపు ప్రధాని మోదీ ఆ సింఫనీ సంగీత మాధుర్యాన్ని ఆస్వాదించనున్నారు. ఇక మోదీ గంగైకొండ చోళపుర బృహదీశ్వారలయంలో అడుగుపెట్టే సమయంలో 50 మంది ఓదువార్లు (స్వామివారి కీర్తనలను గానం చేసేవారు) తిరువాసగాన్ని శ్రావ్యంగా గానం చేయనున్నారు. ఈ వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 38 మంది ఆధీనాలు (మఠాధిపతులు) పాల్గొననున్నారు.

ప్రస్తుతం ఆలయ ప్రాంగణమంతటా పారిశుధ్య పనులు చురుకుగా సాగుతున్నాయి. ఈ వేడుకలలో అరియలూరు జిల్లా నలుమూలల నుండి భక్తులు వచ్చేందుకు ప్రత్యేక బస్సులను కూడా నడుపనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ కేరళ పర్యటన ముగించుకుని తిరువనంతపురం నుండి విమానంలో బయలుదేరి తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో గంగైకొండచోళపురం ఆలయం సమీపంలోని హెలీపాడ్‌లో దిగుతారు. ప్రస్తుతం హెలీపాడ్‌ పనులు చురుకుగా సాగుతున్నాయి.

మంత్రి పరిశీలన...

రాజేంద్ర చోళుడి జయంత్యుత్సవాలకు సంబంధించి గంగైకొండచోళపురంలో చేపడుతున్న ఏర్పాట్లను సోమవారం ఉదయం రవాణా శాఖ మంత్రి శివశంకర్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ వేడుకలు ఈ నెల 23న రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభమవుతాయని, మంత్రులు తంగం తెన్నరసు, సామినాధన్‌, ఆర్‌.రాజేంద్రన్‌, పీకే శేఖర్‌బాబు, చిదంబరం ఎంపీ తొల్‌ తిరుమావళవన్‌ తదితరులు పాల్గొంటారని తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ పెరిగిన గోల్డ్ ధరలు.. కానీ వెండి రేట్లు మాత్రం..

జోరుగా వర్షాలు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 22 , 2025 | 11:07 AM